Visakha International Services : విశాఖ నుంచి బ్యాంకాక్, మలేషియా విమాన స‌ర్వీసులు నిలిపివేత‌- మే 1 నుంచి అమల్లోకి-flight services from visakhapatnam to bangkok and malaysia suspended two services diverted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha International Services : విశాఖ నుంచి బ్యాంకాక్, మలేషియా విమాన స‌ర్వీసులు నిలిపివేత‌- మే 1 నుంచి అమల్లోకి

Visakha International Services : విశాఖ నుంచి బ్యాంకాక్, మలేషియా విమాన స‌ర్వీసులు నిలిపివేత‌- మే 1 నుంచి అమల్లోకి

HT Telugu Desk HT Telugu

Visakha International Services : విశాఖ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఏసియా ప్రకటించింది. బ్యాంకాక్, మలేషియా సర్వీసులను మే 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించింది. దుబాయ్ సర్వీస్ విజయవాడకు తరలిపోయింది.

విశాఖ‌ నుంచి బ్యాంకాక్, మలేషియా విమాన స‌ర్వీసులు నిలిపివేత‌- రెండు స‌ర్వీస్‌లు త‌ర‌లింపు

Visakha International Services : ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ‌ప‌ట్నం నుంచి కొన్ని అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు నిలిపివేశారు. మ‌రికొన్ని అంత‌ర్జాతీయ విమ‌న స‌ర్వీసులు ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఈ ప‌రిణామం విశాఖ‌ప‌ట్నం అభివృద్ధిపై ఇది తీవ్ర ప్రభావం ప‌డ‌నుంద‌ని విశాఖ వాసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రాష్ట్రానికి, అందులోనూ ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇలాంటి ప‌రిణామం చోటుచేసుకోవ‌డం ప‌ట్ల ఆ ప్రాంత వాసులు విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదికంగా విశాఖ‌ప‌ట్నం అభివృద్ధిపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. శ్రీ‌కాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న బాధ్యత‌లు చేపట్టిన త‌రువాత ఆంధ్రప్రదేశ్‌లో విమాన‌యాన క‌నెక్టట‌విటీపై కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఏపీకి దుబాయ్ విమానం తీసుకొస్తామ‌ని, వియత్నాం నుంచి స‌ర్వీసు తీసుకొస్తామ‌ని అన్నారు. అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల‌కు విశాఖ‌ప‌ట్నం నుంచి విమాన స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని అన్నారు.

కానీ ఇప్పుడు ఆయ‌న ప్రక‌ట‌న‌కు విరుద్ధంగా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైజాగ్ నుంచి బ్యాంకాక్‌, కౌలాలంపూర్ (మ‌లేషియా) స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ ప్రక‌టించింది. వైజాగ్ నుంచి దుబాయ్ స‌ర్వీస్ విజ‌య‌వాడ‌కు వెళ్లిపోయింది. వియ‌త్నాం స‌ర్వీస్ హైద‌రాబాద్‌కు వెళ్లిపోయింది. జాతీయ, అంత‌ర్జాతీయ స‌ర్వీసుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న వైజాగ్ ఎయిర్‌పోర్టు, ఇప్పుడు అంత‌ర్జాతీయ స‌ర్వీసులు నిలిపివేయ‌డంతో వెల‌వెలబోతుంద‌ని అక్కడి వారు తెలిపారు.

మే 1 నుంచి నిలిచిపోనున్న సర్వీసులు

క‌రోనా త‌రువాత అంతర్జాతీయ స‌ర్వీసులు వైజాగ్ నుంచి అవ‌స‌ర‌మ‌ని భావించిన అప్పటి ప్ర‌భుత్వం సింగ‌పూర్ స‌ర్వీస్‌ను మొద‌ల పెట్టింది. విశాఖ నుంచి ఎయిర్ ఏసియా సంస్థ 2023 ఏప్రిల్ 9న బ్యాంకాక్‌కు, 2024 ఏప్రిల్ 26న కౌలాలంపూర్ (మ‌లేషియా)కు అంత‌ర్జాతీయ స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. బ్యాంకాక్ స‌ర్వీసులో ప్రతిరోజూ దాదాపు 200 మంది ప్రయాణీకులు రాక‌పోక‌లు సాగిస్తున్నాయి. కౌలాలంపూర్ స‌ర్వీస్ ప్రతి రోజూ 150 నుంచి 200 మంది ప్రయాణికులు రాక‌పోక‌లు సాగిస్తున్నారు.

అయితే ఈ రెండు స‌ర్వీసుల‌ను మే 1 నుంచి నిలిపేస్తున్నట్లు ఎయిర్ఏసియా సంస్థ ప్రక‌టించింది. ఇక నుంచి వైజాగ్ నుంచి ఒకే ఒక్క సింగ‌పూర్ స‌ర్వీస్ న‌డ‌వ‌నుంది. విశాఖ నుంచి దుబాయ్‌కు విమాన స‌ర్వీసు నిర్వహించేందుకు సిద్ధం కాగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో విజ‌య‌వాడ నుంచి ప్రారంభించింది. వైజాగ్ నుంచి వియ‌త్నాంలోని ప్రధాన న‌గ‌రం హోచిమిన్ సిటీకి ఈ ఏడాది స‌ర్వీసు ప్రారంభిస్తామ‌ని వియ‌ట్‌జెట్ ఎయిర్‌లైన్స్ ప్రక‌టించింది. అయితే ఈ సర్వీస్ హైద‌రాబాద్ నుంచి ప్రారంభించారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం