Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి-five family members die in car cras in anantapur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Maheshwaram Mahendra Chary HT Telugu
May 18, 2024 10:38 AM IST

Road Accident in Anantapur: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం (Twitter)

Anantapur Road Accident : కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది.

శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక వివరాల ప్రకారం….అనంతపురం రాణినగర్‌కు చెందిన ఓ కుటుంబం పెళ్లి షాపింగ్‌కు కోసం కారులో హైదరాబాద్ వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో అతివేగం కారణంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఇదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ… కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

అలీ సాహెబ్ (58), షేక్ సిరాజ్ బాషా (28), మహ్మద్ అయాన్ (6), అమన్ (4), రెహానా బేగం (40)ను మృతులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన షేక్‌ సురోజ్‌ బాషా వివాహం ఈ నెల 27న జరగనునంది. పెళ్లి వేడుకకు సిద్ధమవుతున్న వేళ ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు చనిపోగా… కుటుంబం సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోవటం అతిపెద్ద విషాదంగా మారింది.

మాదాపూర్‎లో కారు బీభత్సం

Madhapur Car Accident : హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వైపు వేగంగా వెళుతున్న కారు మాదాపూర్ వద్దకు రాగానే ఒక్కసారే అదుపు తప్పింది.అనంతరం రోడ్డు పక్కనే ఉన్న ఓ పాల వ్యాపారి మీదకు దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.....మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు..ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో శుక్రవారం అర్థరాత్రి ఓ కారు హల్ చల్ చేసింది. అతి వేగంగా వచ్చి అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ రవి తెలిపిన వివరాల ప్రకారం...... బండ్లగూడ జాగిర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ రోహిత్ ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం అతను ఆస్పత్రి నుంచి విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా......లంగర్ హౌస్ సంగం వద్దకు రాగానే ఒక్కసారిగా కారు బ్రేక్ వేయబోయి రేస్ పై తొక్కాడు. దీంతో కారు అదుపు తప్పి నేరుగా ఫుట్ పాత్ పై ఉన్న పండ్ల దుకాణాల పైకి దూసుకెళ్లింది. 

ఈ ప్రమాదంలో పండ్ల వ్యాపారి సోహెల్ కు తీవ్రంగా గాయాలు కాగా…రోహిత్,తరుణ్ కు స్వల్ప గాయాలు ఆయాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024