YSRCP Mission 175 : మిషన్ 175.. గెలుపు గుర్రాలకే టికెట్-first priority for winning horses in ysrcp mission 175 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  First Priority For Winning Horses In Ysrcp Mission 175

YSRCP Mission 175 : మిషన్ 175.. గెలుపు గుర్రాలకే టికెట్

సీఎం జగన్
సీఎం జగన్

CM Jagan Strategy For Next Election : వచ్చే ఎన్నికల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ అనుకుంటోంది. ఈ మేరకు పార్టీ ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మిషన్ 175పై సీఎం జగన్ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. వైసీపీలోని.. 'వారసుల'కి టిక్కెట్లు నిరాకరించనున్నారు. 2024 'మిషన్ 175' కోసం సీనియర్లకు పార్టీ టిక్కెట్లు దక్కుతాయి. పలువురు సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నందున వారు హైకమాండ్‌కు ప్రతిపాదనలు పంపారు. 2024 ఎన్నికల కోసం తాను ఎలాంటి అవకాశాలను తీసుకోలేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీని ద్వారా అభ్యర్థనలను నిర్మొహమాటంగా తిరస్కరించారు.

ట్రెండింగ్ వార్తలు

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు 2024 మధ్యలో జరుగుతాయి. ఎమ్మెల్యేలంతా పాల్గొనే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని.. జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. నివేదికలను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ మెరిట్ ఆధారంగానే.. తదుపరి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనున్నారు.

మెుదట్లోనే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు సీఎం అంచనాల్లో వెనకబడ్డారు. తర్వాత వారి సంఖ్య 45కి, ఇటీవల 27కి పడిపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మంచి మార్కులు రావాలని చెమటోడ్చుతున్నారు. పలువురు సీనియర్ నాయకులు తమ కుమారులు, కుమార్తెలు, బంధువులను రాజకీయాల్లోకి ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తరువాతి ఎన్నికలకు అభ్యర్థులుగా చూపించేందుకు గడప గడపకు కార్యక్రమం ఉపయోగపడుతుందని అనుకున్నారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం తన కుమారుడు వెంకట్‌నాగ్‌ను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర తన కుమార్తె శ్రావణికి అవకాశం కల్పించాలని చూస్తున్నట్టుగా సమాచారం. మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య తన కుమారుడు కృష్ణమూర్తిని రాజకీయాల్లోకి తీసుకువచ్చే విషయంపై ఆలోచిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి స్థానం కల్పించాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమారుడు డాక్టర్ సందీప్‌ జనాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు తన కుమారుడు రాఘవ రెడ్డిని జనాల్లోకి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నారు. డజను మంది శాసనసభ్యులు తమ పిల్లలు లేదా దగ్గరి బంధువులను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని సీఎం జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. 2024లో పార్టీ టిక్కెట్ మంజూరులో గెలుపు అవకాశాలు ఉన్నవారికే ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో సీనియర్ నేతల ఆశలు గల్లంతు అయ్యాయి.

సీనియర్ నేతలు అన్ని వర్గాలు, గ్రూపులు, వివిధ రంగాలు, అధికారులతో సంబంధాలు ఉన్నాయని, ఎమ్మెల్యేల పిల్లలతో పోల్చితే మంచి మార్కులే వేయగలరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో సీనియర్లు పోటీ చేయాలని, గడప గడపకూ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి పనిచేయాలని జగన్‌ ఆదేశించారని ఓ నేత తెలిపారు.