AP ECET 2024 Final Admissions: ఆగస్టు 1 నుంచి 5 వరకు తుది విడత ఈసెట్ 2024 కౌన్సిలింగ్
AP ECET 2024 Final Admissions: ఏపీ ఈసెట్ 2024 తుది విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా మిగిలి ఉన్న సీట్ల కోసం తుది విడత కౌన్సిలింగ్ చేపడుతున్నారు
AP ECET 2024 Final Admissions: ఏపీ ఈసెట్ 2024 తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీ ఈసెట్ 2024 ద్వారా మూడేళ్ల డిప్లొమా విద్యార్ధులు, బిఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బిటెక్ రెండో ఏడాదిలోప్రవేశాలు కల్పిస్తారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్ నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
పూర్తైన తొలి విడత అడ్మిషన్లు…
ఏపి ఈసెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు , రిజిస్ట్రేషన్ కోసం జూన్ 26 నుండి 30వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. సర్టిఫికెట్ల అప్ లోడ్ కు జూన్ 27 నుండి జూలై 3 వరకు అనుమతించారు. జూలై 1 నుండి 4వ తేదీ వరకు ఆప్షన్స్ నమోదు, 5 న మార్పులకు అవకాశం ఉందని డాక్టర్ నవ్య పేర్కొన్నారు. సీట్ల ఎలాట్మెంట్ జూలై 8న చేయనుండగా, 9 నుండి 15 వరకు సెల్ఫ్ జాయినింగ్ , కళాశాలలో రిపోర్టింగ్ చేయవలసి ఉండగా , జూలై 10వ తేదీ నుండే క్లాసులు ప్రారంభం అయ్యాయి.
ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్ల డిప్లొమా, బిఎస్సీ మ్యాథ్స్ విద్యార్ధులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడానికి వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ జూన్ 26 నుంచి తొలిదశ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. వెబ్ కౌన్సిలింగ్‌లో పేమెంట్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆప్షన్లను నమోదు చేయనున్నారు.
జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు మొదటి విడత అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఏపీ ఈసెట్2024లో అర్హత సాధించిన డిప్లొమా, బిఎస్సీ డిగ్రీ విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు కల్పిస్తారు.
కౌన్సిలింగ్ షెడ్యూల్...
జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, విద్యార్థి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు.
జూన్ 27 నుంచి జూలై 3వ తేదీ వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
జూలై 1 నుంచి 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేస్తారు.
జూలై 5న వెబ్ ఆప్షన్లలో మార్పులకు అనుమతిస్తారు.
జూలై 8న సీట్ అలాట్మెంట్ చేస్తారు.
జూలై 9 నుంచి 15వ తేదీ వరకు విద్యార్ధులు ఎంపిక చేసుకున్న కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 10 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.
కౌన్సిలింగ్ షెడ్యూల్ పూర్తి వివరాల కోసం ఈసెట్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. https://ecet-sche.aptonline.in/ECET/Views/index.aspx
ఆ కాలేజీల్లో ఫీజు రియింబర్స్‌మెంట్ లేదు….
కళాశాల కోడ్‌లు SVUCSS మరియు JNTKSSలలో సెల్ఫ్-సపోర్టింగ్ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని ఈ సెట్ అభ్యర్థులకు సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. ఈ కోర్సులకు ఎంపికలు చేసే సమయంలో అభ్యర్థులు ఫీజు రియింబర్స్‌మెంట్ లేని విషయాన్ని గమనించాలని సూచించారు.