Railway ALERT : ప్రయాణికులకు అల‌ర్ట్‌... విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు, వందేభార‌త్ ట్రైన్ రీషెడ్యూల్-few trains have been canceled in vijayawada division ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Railway Alert : ప్రయాణికులకు అల‌ర్ట్‌... విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు, వందేభార‌త్ ట్రైన్ రీషెడ్యూల్

Railway ALERT : ప్రయాణికులకు అల‌ర్ట్‌... విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు, వందేభార‌త్ ట్రైన్ రీషెడ్యూల్

HT Telugu Desk HT Telugu
Published Feb 09, 2025 11:51 AM IST

ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్ ఇచ్చింది. విజయవాడ డివిజన్ లో పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఇక విశాఖ‌ప‌ట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభార‌త్ రైలును రీషెడ్యూల్‌ చేశారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (PTI)

ఇండియ‌న్ రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా నాలుగు రైళ్లను రద్దు చేసింది. మరో మూడు రైళ్ల‌ను దారి మ‌ళ్లించింది. విశాఖ‌ప‌ట్నం-సికింద్రాబాద్ వందేభార‌త్ రీషెడ్యూల్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.

రద్దు చేసిన రైళ్లు:

1. విశాఖపట్నం నుండి బయలుదేరే  విశాఖపట్నం-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18519) ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ఫిబ్ర‌వ‌రి 20 వ‌ర‌కు రద్దు చేశారు.

2. ఎల్‌టీటీ నుండి బయలుదేరే  ఎల్‌టిటి-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18520) ఫిబ్ర‌వ‌రి 12 నుండి ఫిబ్ర‌వ‌రి 22 వ‌ర‌కు రద్దు చేశారు.

3. టాటా నగర్ నుండి బయలుదేరే  టాటా నగర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18111) ఫిబ్ర‌వ‌రి 13న ర‌ద్దు చేశారు.

4. యశ్వంత్‌పూర్ నుండి బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్‌ 18112 యశ్వంత్‌పూర్-టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్ర‌వ‌రి 9 నుండి ఫిబ్ర‌వరి 16 వ‌ర‌కు రద్దు చేశారు.

3 రైళ్లు దారి మళ్లింపు

1. హైదరాబాద్ నుండి బయలుదేరే హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18046) ఫిబ్ర‌వ‌రి 18 నుండి ఫిబ్ర‌వ‌రి 20 వరకు సికింద్రాబాద్-పగిడిపల్లి-గుంటూరు-విజయవాడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఈ రైలుకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, అలెర్, భువనేశ్వర్ స్టాప్‌లను తొల‌గించారు.

2. భువనేశ్వర్ నుంచి బయలుదేరే  భువనేశ్వర్ - సీఎస్‌టీ ముంబై రైలు(నెంబ‌ర్‌ 11020) ఫిబ్ర‌వ‌రి 17 నుండి ఫిబ్ర‌వ‌రి 19 వరకు విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర స్టాప్‌లు తొలగించారు.

3. షాలిమార్ నుంచి బయలుదేరే షాలిమార్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు( నెంబ‌ర్‌ 22849) ఫిబ్ర‌వ‌రి 19న విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఈ రైలు రాయనపాడు, వరంగల్, కాజీపేట స్టాప్‌ల‌ను తొల‌గించారు.

'వందే భార‌త్' రీషెడ్యూల్‌:

1. విశాఖపట్నం నుంచి బయలుదేరే… విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు( నెంబ‌ర్ 20833) ను రీషెడ్యూల్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 19, 20 తేదీల్లో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే బదులు ఉదయం 7 గంటలకు బయలుదేరనుంది.

2. సికింద్రాబాద్ నుంచి బ‌య‌లుదేరే…. సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 20834)ను రీషెడ్యూల్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 19, 20 తేదీల్లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ‌దులు సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం