Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి అప్‌డేట్స్ - ఫిబ్రవరి నెలలో జరిగే కార్యక్రమాలివే-festivals and religious events are lined up in tirumala for the month of february 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి అప్‌డేట్స్ - ఫిబ్రవరి నెలలో జరిగే కార్యక్రమాలివే

Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి అప్‌డేట్స్ - ఫిబ్రవరి నెలలో జరిగే కార్యక్రమాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 31, 2025 12:05 PM IST

ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తేదీల వారీగా పూర్తి వివరాలను వెల్లడించింది. ఫిబ్రవరి ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలు ఉంటాయని పేర్కొంది.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది.ఫిబ్రవరి 2న వసంత పంచమి, ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలు ఉంటాయని పేర్కొంది. ఇక ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వేడుకలు ఉంటాయని వివరించింది.

yearly horoscope entry point

ఫిబ్రవరి నెలలో కార్యక్రమాలు:

  • ఫిబ్రవరి 2 – వసంత పంచమి
  • ఫిబ్రవరి 4 – రథ సప్తమి
  • ఫిబ్రవరి 5 – భీష్మాష్టమి
  • ఫిబ్రవరి 6 – మధ్వనవమి
  • ఫిబ్రవరి 8 – భీష్మ ఏకాదశి
  • ఫిబ్రవరి 12 – శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ
  • ఫిబ్రవరి 24 – సర్వ ఏకాదశి
  • ఫిబ్రవరి 26 – మహాశివరాత్రి

రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు:

రథ సప్తమి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మినీ బ్రహ్మోత్సవం తరహాలో రథసప్తమి వేడుకలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు.

వాహన సేవల వివరాలు:

  • ఉదయం 5.30 – 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) – సూర్య ప్రభ వాహనం
  • ఉదయం 9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
  • ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
  • మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం
  • మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం
  • సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
  • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం

రథసప్తమి సందర్భంగా ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

Whats_app_banner

సంబంధిత కథనం