Dead Body Carries On Bike: 7 ఏళ్ల కొడుకు శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన తండ్రి-father carries son s mortal remains on two wheeler in ap s chittoor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Father Carries Son's Mortal Remains On Two-wheeler In Ap's Chittoor

Dead Body Carries On Bike: 7 ఏళ్ల కొడుకు శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన తండ్రి

HT Telugu Desk HT Telugu
Oct 12, 2022 10:22 AM IST

father carries son dead body on bike:ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. 7 ఏళ్ల కొడుకు మృతదేహాన్ని తండ్రి బైక్ పై తరలించాడు.

కొడుకు మృతదేహాంతో తండ్రి
కొడుకు మృతదేహాంతో తండ్రి

father carries son dead body in chittor district: తిరుపతి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. పాముకాటుకు గురైన 7 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆస్పత్రి నుంచి కొడుకు మృతదేహాన్ని ద్విచక్రవానంపై ఇంటికి తీసుకువచ్చాడు తండ్రి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగిందంటే....

తిరుపతి జిల్లాలోని కేవీబీపురంలో మంగళవారం 7 ఏళ్ల బాలుడు బసవయ్య పాము కాటేసింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి... ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించాడు. దీంతో షాక్ కు గురైన తండ్రి... కన్నీటిపర్యంతమయ్యాడు. అయితే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు పలు వాహనాలను ఆశ్రయించినప్పటికీ... ఎవరూ రాలేదని తెలిసింది. అయితే చేసేందేం లేక ఓ ద్విచక్రవాహనంపై కొడుకు శవాన్ని ఇంటికి తీసుకెళ్లాడు.

కొడుకు శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కె. వెంకటరామ రెడ్డి స్పందించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తండ్రి అంబులెన్స్ సహాయం అడగలేదని చెప్పారు.

పాము కాటుతో 7 ఏళ్ల బాలుడిని అస్పత్రికి తీసుకొచ్చారని కలెక్టర్ తెలిపారు. యాంటీ వీనమ్ ఇచ్చినప్పటికీ... బాలుడిని ఆలస్యంగా తీసుకురావటంతో మృతి చెందాడని పేర్కొన్నారు.

బాలుడి తండ్రి అంబులెన్స్ సదుపాయం గురించి అడగలేదు. బాలుడు మృతి చెందాడని వైద్యులు చెప్పగానే వెంటనే మృతేదేహాన్ని బైక్ పై తీసుకెళ్లాడు. ఈ విషయం కూడా డాక్టర్లకు తెలియరాలేదని... అందుకే ఏర్పాట్లు చేయలేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

మృతేదేహాం తరలించేందుకు ఏర్పాట్లు చేశారా అని వైద్యులు అడగగా... తండ్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసిందని కలెక్టర్ చెప్పారు.

WhatsApp channel

టాపిక్