పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికుల దుర్మరణం-fatal road accident occurred in palnadu district four people died ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికుల దుర్మరణం

పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికుల దుర్మరణం

Sarath Chandra.B HT Telugu

పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బొప్పాయిల లోడుతో వెళుతున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొప్పాయిల లోడ్‌తో వెళుతున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. స్పాట్‌లోనే ముగ్గురు కార్మికులు చనిపోగా ఆస్పత్రిలో మరొకరు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి వాసులుగా గుర్తించారు.

మంత్రి లోకేష్‌ సంతాపం..

పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసినట్టు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం