Tamilnadu Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు ఏపీ విద్యార్థుల దుర్మరణం-fatal road accident in tamil nadu five ap students died ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tamilnadu Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు ఏపీ విద్యార్థుల దుర్మరణం

Tamilnadu Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు ఏపీ విద్యార్థుల దుర్మరణం

Sarath chandra.B HT Telugu
Aug 12, 2024 06:33 AM IST

Tamilnadu Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్ర కోసం తిరువళ్లూరు పర్యటనకు వెళ్లిన ఏడుగురు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్ధులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన విద్యార్ధులు ప్రయాణించిన కారు
రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన విద్యార్ధులు ప్రయాణించిన కారు

Tamilnadu Accident: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సెలవు కావడంతో తిరువళ్లూరు పర్యటనకు వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్ధులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

విహార యాత్ర కోసం వెళ్లిన విద్యార్థుల్ని తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. చెన్నై ఎస్‌ఆర్‌ఎం వర్శటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార‌ులు ఆదివారం సెలవు కావడంతో విహార యాత్ర కోసం వెళ్లారు. తిరుగు ప్రమాణంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం ఆటవిడుపు కోసం వెళ్లన స్నేహితుల్ని రోడ్డు ప్రమాదం కబళించింది. చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థుల కారులో శనివారం రాత్రి తిరువళ్లూరు వెళ్లారు. ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యతో పాటు ఏడుగురు స్నేహితులు ఎస్‌ఆర్‌ఎం వర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఏపీలోని వేర్వేరు జిల్లాలకు చెందిన వీరంతా శనివారం రాత్రి విహార యాత్రకు బయల్దేరారు.

శనివారం తిరువళ్లూరు అరుణాచల ఆలయ దర్శనం కోసం బయల్దేరారు. రెండు రోజులు పలు ప్రాంతాల్లో పర్యటించి ఆదివారం రాత్రి తిరిగి హాస్టల్‌కు తిరిగి వస్తున్నారు. విద్యార్థులు ప్రయాణిస్తన్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్ధులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

విద్యార్థులు ఆదివారం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయానికి వెళ్లినట్టు గుర్తించారు. స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయల్దేరగా ఈ ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది.

లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన నితీష్, తిరుపతికి చెందిన యుగేశ్(23), చేతన్(22), కర్నూలుకు చెందిన రామోహ్మన్(21), విజయవాడకు చెందిన బన్ను నితీష్(22) స్పాట్‌లోనే మృతి చెందారు.

నెల్లూరు జిల్లాకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని స్థానికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. వారిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు.