AP Ministers: ఫైళ్ల క్లియరెన్స్‌లో ఫరూఖ్ టాప్… సుభాష్ లాస్ట్‌, క్యాబినెట్‌లోపేర్లు చదివిని సీఎం చంద్రబాబు-farooq is in first place to clear files and vasamsetty subhash in last place ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ministers: ఫైళ్ల క్లియరెన్స్‌లో ఫరూఖ్ టాప్… సుభాష్ లాస్ట్‌, క్యాబినెట్‌లోపేర్లు చదివిని సీఎం చంద్రబాబు

AP Ministers: ఫైళ్ల క్లియరెన్స్‌లో ఫరూఖ్ టాప్… సుభాష్ లాస్ట్‌, క్యాబినెట్‌లోపేర్లు చదివిని సీఎం చంద్రబాబు

Bolleddu Sarath Chandra HT Telugu
Published Feb 06, 2025 07:54 PM IST

AP Ministers: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గం ప్రతి నెలలో రెండు సార్లు ఖచ్చితంగా భేటీ అవుతోంది. అవసరమైతే అదనపు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం తాజా భేటీలో ఫైల్స్‌ క్లియరెన్స్‌పై మంత్రుల పనితీరును వివరించగా ఫరూక్‌ అందిరి కంటే ముందున్నారు.

ఏపీ మంత్రి వర్గ సమావేశంలో మంత్రుల పనితీరును వివరించిన సీఎం చంద్రబాబు
ఏపీ మంత్రి వర్గ సమావేశంలో మంత్రుల పనితీరును వివరించిన సీఎం చంద్రబాబు

AP Ministers: ఏపీ మంత్రుల పనితీరును క్యాబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. గత ఏడాది డిసెంబర్ వరకు ఫైళ్లు క్లియరెన్స్‌లో ముందున్న మంత్రుల పనితీరును చదివి వినిపించారు. మంత్రుల్లో ఫరూక్ తొలి స్థానంలో ఉండగా వాసంశెట్టి సుభాష్‌ ఆఖరి స్థానంలో నిలిచారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ స్థానంలో తాను ఉండగా, నారా లోకేష్‌ 8వ స్థానంలో పవన్ కళ్యాణ్‌ పదో స్థానంలో ఉన్నారు. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. బీజేపీ మంత్రి సత్యకుమార్‌ 7వ స్థానంలో ఉన్నారు. క్యాబినెట్ మంత్రుల్లో చివరి ఐదు స్థానాల్లో ఉన్న మంత్రులు ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్నారు. మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్‌ చివరి స్థానాల్లో ఉన్నారు.

ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరు…

1.ఫరూఖ్

2. కందుల దుర్గేష్

3.కొండపల్లి శ్రీనివాస్

4. నాదెండ్ల మనోహర్

5. డోలా బాలవీరాంజనేయ స్వామి

6. చంద్రబాబు

7. సత్యకుమార్ యాదవ్

8. నారా లోకేష్

9. బీసీ జనార్థన్ రెడ్డి

10. పవన్ కళ్యాణ్

11. సవిత

12. కొల్లు రవీంద్ర

13. గొట్టిపాటి రవికుమార్

14. నారాయణ

15. టీజీ భరత్

16. ఆనం రాం నారాయణరెడ్డి

17. అచ్చెన్నాయుడు

18. రాంప్రసాద్ రెడ్డి

19. గుమ్మడి సంధ్యారాణి

20. వంగలపూడి అనిత

21. అనగాని సత్యప్రసాద్

22. నిమ్మల రామానాయుడు

23. కొలుసు పార్థసారధి

24. పయ్యావుల కేశవ్

25. వాసంశెట్టి సుభాష్

Whats_app_banner