Amaravati R5 Zone: ఆర్5 జోన్‌పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రైతులు…విచారణ వాయిదా
Amaravati R5 Zone: రాజధాని నిర్మాణ: కోసం సేకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడానికి ఏపీ హైకోర్టు అనుమతించడంపై రాజధాని రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరుపుతామని సీజేఐ ధర్మాసనం ప్రకటించింది.
Amaravati R5 Zone: రాజధాని నిర్మాణం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో స్థానికేతరులకు నివాస స్థలాలను కేటాయించడంపై రైతుల అభ్యంతరాలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో రైతులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం కోర్టు ప్రారంభమైన వెంటనే రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై వెంటనే విచారన చేయాలని సీజేఐ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై వచ్చే వారం విచారణ జరుపుతామని సీజేఐ ప్రకటించారు. క
ట్రెండింగ్ వార్తలు
కొద్ది రోజుల క్రితం పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో అమరావతి రైతులు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై వెంటనే విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా రైతుల తరపున న్యాయవాదులు మెన్షన్ చేశారు. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరుపుతామని సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రకటించారు.
మరోవైపు రాజధానిలో పేదలకు ఇళ్ల స‌్థలాల కేటాయింపుపై ఉన్న అడ్డంకులు తొలగిపోవలడంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వారికి ఇళ్ల పట్టాలు అందించి స్థలాలను కేటాయించనున్నారు. మొత్తం 20,684 మంది లబ్దిదారులకు పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. లబ్దిదారులకు ఇప్పటికే భూకేటాయింపు పత్రాలు ఇచ్చామని, 20,684మందికి ఫ్లాట్ డెవలప్‌మెంట్‌తో పాటు ఇంటి పట్టాలను అందచేయనున్నారు.
విజయవాడ నగరానికి చెందిన మూడు నియోజక వర్గాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు అందించనున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో 570 ఎకరాలను లబ్దిదారుల ఇళ్ల స్థలాలకు కేటాయించనున్నట్లు చెప్పారు. నంబరింగ్ అయిన తర్వాత అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడతామని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. గతంలో జిల్లాకు చెందిన 24వేల మంది లబ్దిదారులు నమోదైనా రీఎగ్జామిన్‌లో దాదాపు ఐదు వేల మంది అచూకీ దొరకలేదని, అదనంగా మరో 95 ఎకరాలను కూడా కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు. 18వ తేదీ నాటికి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాల కేటాయింపు పూర్తి చేస్తామని ప్రకటించారు.