SPL Trains Extension: ఏపిలో నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోకలు పొడిగింపు, ప్రయాణికుల రద్దీతో కొనసాగింపు
SPL Trains Extension: రాష్ట్రంలో నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోకలు మరిన్ని రోజుల పాటు పొడిగించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నడిచే ఈ రైళ్లు వారపు ప్రత్యేక రైళ్లు (వీక్లీ స్పెషల్ ట్రైన్స్)గా ఇండియన్ రైల్వే అందుబాటులోకి తెచ్చింది.
SPL Trains Extension: రాష్ట్రంలో నాలుగు ప్రత్యేక రైళ్ల రాకపోకలు మరిన్ని రోజుల పాటు పొడిగించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నడిచే ఈ రైళ్లు వారపు ప్రత్యేక రైళ్లు (వీక్లీ స్పెషల్ ట్రైన్స్)గా ఇండియన్ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటి గడువు ముగియడంతో జూలై 28 వరకు పొడిగించారు. ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నడుపుతున్న వారపు ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ తెలిపింది.
హౌరా-యశ్వంత్‌పూర్ (02863) వారపు ప్రత్యేక (వీక్లీ స్పెషల్) రైలును జూలై 4, 11, 18, 25 తేదీల్లో ప్రయాణం సాగిస్తుంది. అంటే ప్రతి గురువారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. హౌరా (పశ్చిమ బెంగాల్)లో ప్రతి గురువారం మధ్యాహ్నం 12ః40 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు (శుక్రవారం) తెల్లవారుజామున 2.43 గంటలకు దువ్వాడ (విశాఖపట్నం)కు చేరుకుంటుంది. అలాగే అదే రోజు అర్థరాత్రి 12ః15 గంటలకు యశ్వంత్‌పూర్ (కర్ణాటక) చేరుకుంటుంది.
తిరిగి ప్రయాణం యశ్వంత్‌పూర్-హౌరా (02864) వారపు ప్రత్యేక (వీక్లీ స్పెషల్) రైలును జూలై 6, 13, 20, 27 తేదీల్లో ప్రయాణం సాగిస్తుంది. అంటే ప్రతి గురువారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. యశ్వంత్‌పూర్ (కర్ణాటక)లో ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి 11ః05 గంటలకు దువ్వాడ (విశాఖపట్నం)కు చేరుకుంటుంది. మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం 1ః25 గంటలకు హౌరా (పశ్చిమ బెంగాల్) చేరుకుంటుంది. ఈ హౌరా-యశ్వంత్‌పూర్-హౌరా రైళ్లుల్లో రెండు సెకండ్ ఏసీ, ఎనిమిది థర్డ్ ఏసీ ఎకానమీ, నాలుగు స్లీపర్, నాలుగు జనరల్, ఒక సెకండ్ క్లాస్ కమ్ లగేజీ, దివ్యాంగు, మహిళ, ఒక మోటరు కార్ బోగీలు ఉంటాయి.
సంత్రగచ్చి-ఎస్ఎంవీ బెంగళూరు (08845) వారపు ప్రత్యేక రైలు (వీక్లీ స్పెషల్ ట్రైన్) జూలై 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం ఈ రైలు ప్రయాణిస్తుంది. సంత్రగచ్చిలో ఈ రైలు రాత్రి 7 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (శనివారం) ఉదయం 9 గంటలకు దువ్వాడ (విశాఖపట్నం) చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు (ఆదివారం) తెల్లవారు జామున 2 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు చేరుకుంటుంది.
తిరిగి ప్రయాణంలో ఎస్ఎంవీ బెంగళూర్-సంత్రగచ్చి (08846) వారపు ప్రత్యేక రైలు (వీక్లీ స్పెషల్ ట్రైన్) జూలై 7, 14, 21, 28 తేదీల్లో ప్రయాణిస్తుంది. అంటే ప్రతి ఆదివారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఎస్ఎంవీ బెంగళూరులో ఈ రైలు తెల్లవారు జామున 3ః15 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు ఆదివారం రాత్రి 8ః55 గంటలకు దువ్వాడ (విశాఖపట్నం) చేరుకుంటుంది. మరుసటిరోజు (సోమవారం) ఉదయం 10ః45 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటంది. సంత్రగచ్చి-ఎస్ఎంవీ బెంగళూర్-సంత్రగచ్చి రైళ్లులో 19 జనరల్, ఒక సెకండ్ క్లాస్ కమ్ లగేజీ, దివ్యాంగు, మహిళ, ఒక మోటరు కార్ బోగీలు ఉంటాయి.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)