Special Trains Extension: అలర్ట్.. ఈ రూట్ లో నెల పాటు డైలీ స్పెషల్ ట్రైన్లు పొడిగింపు-extension of daily special trains between guntakal mantralayam road ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Extension Of Daily Special Trains Between Guntakal Mantralayam Road

Special Trains Extension: అలర్ట్.. ఈ రూట్ లో నెల పాటు డైలీ స్పెషల్ ట్రైన్లు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 10:29 PM IST

South Central Railway Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. గుంతకల్ - మంత్రాలయం మధ్య ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించింది.

ప్రత్యేక రైళ్లు పొడిగింపు
ప్రత్యేక రైళ్లు పొడిగింపు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా పలు రూట్లలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఈ మేరకు వివరాలను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

గుంతకల్-మంత్రాలయం రోడ్ ట్రైన్ (ట్రైన్ నెంబర్ 07411)ను జూన్ 1 నుంచి 30 తేదీ వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు… ఆయా తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి.. రాత్రి 7.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. మరోవైపు మంత్రాలయం రోడ్-గుంతకల్ ట్రైన్( ట్రైన్ నెంబర్ 07412) ను జూన్ 2 నుంచి జులై 1వ తేదీ వరకు నడపనున్నారు. ఈ ట్రైన్ ఉదయం 4.40 గంటలకు బయలుదేరి.. 06.20 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.ఈ స్పెషల్ ట్రైన్స్… మొలగవల్లి, ఆదోని, కోస్గి స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటించారు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.

ప్రత్యేక రైళ్లు…

కాచిగూడ - తిరుపతి, తిరుపతి - కాచిగూడ, కాచిగూడ - కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ - కాచిగూడ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపుతోంది దక్షిణ మధ్య రైల్వే. అయితే వేసవి రద్దీ దృష్ట్యా వీటిని పొడిగించింది. ఈ మేరకు కొత్త తేదీలను ప్రకటించింది.కాచిగూడ-తిరుపతి(ట్రైన్ నెం -07061) స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఈ స్పెషల్ ట్రైన్ జూన్ 1వ తేదీన కాచిగూడ నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఇక తిరుపతి-కాచిగూడ( ట్రైన్ నెం- 07062 ) ట్రైన్ ను జూన్ 2వ తేదీన నడపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడకు చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇక కాచిగూడ-కాకినాడ టౌన్(ట్రైన్ - 07417 ) మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. ఈ ప్రత్యేక రైలు జూన్ 3వ తేదీన రాత్రి 8:45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 08:45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఇక కాకినాడ టౌన్(ట్రైన్ నెంబర్ 07418) నుంచి కూడా జూన్ 04 ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ ట్రైన్ కాకినాడ నుంచి 09.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్స్... కాచిగూడ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సమార్లకోట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు ప్రకటించారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ - 2 టైర్, ఏసీ - 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.

WhatsApp channel