AP: అయ్యో పవన్ ట్వీట్ అంత పని చేసిందే..! క్లారిటీ ఇచ్చిన బాలినేని-ex minister balineni srinivas reddy clarity on party change speculation over pawan tweet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ex Minister Balineni Srinivas Reddy Clarity On Party Change Speculation Over Pawan Tweet

AP: అయ్యో పవన్ ట్వీట్ అంత పని చేసిందే..! క్లారిటీ ఇచ్చిన బాలినేని

Mahendra Maheshwaram HT Telugu
Aug 10, 2022 11:33 AM IST

ex minister balineni srinivas reddy - pawam kalyan: వైసీపీలో కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ ట్వీట్ తో మొదలైన ఈ వార్తలు... బాలినేని క్లారిటీ ఇచ్చే వరకు వచ్చింది.

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బాలినేని
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బాలినేని (HT)

ex minister balineni clarity on party change: బాలినేని శ్రీనివాస్ రెడ్డి.... ప్రకాశం జిల్లాకు చెందిన ఇయన వైసీపీలో కీలక నేత..! ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని... జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆయన చోటు దక్కలేదు. ఈ క్రమంలో... ఆయన తీవ్రంగా ఆవేదనకు లోనయ్యారు. ఓ దశలో పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ పార్టీ అగ్రనాయకత్వం... చర్చలు జరపటంతో శాంతించారు. తాజాగా ఆయన పార్టీ మారుతున్నారని, జనసేనలోకి వెళ్తున్నారంటూ ఓ లెవల్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో బాలినేని... ఏకంకా పార్పీ మార్పు వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

పవన్ ట్వీట్ తో మొదలు...

అసలు బాలినేని జనసేనలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరగడానికి గల కారణాలు లేకపోలేదు. జాతీయ చేనేత దినోత్సవం రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్... జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఛాలెంజ్ విసిరారు. చేనేత దుస్తువులు ధరించి ఫొటోలు షేర్ చేయాలని పేర్కొన్నారు. అయితే ఈ ఛాలెంజ్ స్వీకరించిన జనసేనాని పవన్.... పలువురి ప్రముఖలకు కూడా ఈ సవాల్ విసిరారు. ఇందులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని కూడా ఉన్నారు. అయితే ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చాలా ఆసక్తిని రేపింది.

బాలినేని రిప్లే...

ఇక పవన్ కల్యాణ్ చేసిన ట్విట్ కు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఆయన కూడా చేనేత వస్తువులు ధరించి ఫొటోలను షేర్ చేశారు. 'ట్విట్టర్ వేదికగా చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్‌కళ్యాణ్‌ గారు చేసిన చేనేత సవాల్ ను స్వీకరించాను ధన్యవాదాలు.నేను చిత్తశుద్ధితో చేనేత మంత్రిగా YSR గారి ప్రభుత్వంలో పని చేశాను. ఆ నాడు YSR గారు 300కోట్ల రూపాయల చేనేతల కోసం రుణమాఫీ చేశారు' అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు ఓ ఫొటోను కూడా జత చేశారు. సరిగ్గా ఈ పరిణామమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకేముంది బాలినేని... జనసేనలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ వార్తలతో ఆయన అనుచరుల్లో కూడా గందరగోళం నెలకొంది. దీంతో స్వయంగా ఆయనే క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

తాను జనసేనకు వెళ్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వార్తలు సరికాదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గిద్దలూరు నియోజకవర్గ నేతలతో భేటీ కావటాన్ని కూడా పార్టీ మార్పు కోసమే అన్న కోణంలో చూస్తున్నారని.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. పార్టీలో సమన్వయం కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు. అందుకే గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ తరహా వార్తలపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తపై బాలినేని అనుచరులు దాడి చేశారంటూ పవన్ కల్యాణ్… తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

IPL_Entry_Point