YISU Admissions: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో ఉపాధి గ్యారంటీ కోర్సులు.. అడ్మిషన్ నోటిఫికేషన్‌ విడుదల-employment guarantee courses at young india skill university admission notification released ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Yisu Admissions: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో ఉపాధి గ్యారంటీ కోర్సులు.. అడ్మిషన్ నోటిఫికేషన్‌ విడుదల

YISU Admissions: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో ఉపాధి గ్యారంటీ కోర్సులు.. అడ్మిషన్ నోటిఫికేషన్‌ విడుదల

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 08, 2025 08:46 AM IST

YISU Admissions: తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీలో పలు ఉపాధినిచ్చే కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. యువతకు ఉపాధి కల్పించేందుకు, పారిశ్రామిక భాగస్వామ్యంతో కోర్సుల నిర్వహణ కోసం యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీని నెలకొల్పారు. కొన్ని కోర్సులతో పాటు ఉద్యోగ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

తెలంగాణ స్కిల్ యూనివర్శిటీలో ఉపాధి కోర్సులకు నోటిఫికేషన్‌
తెలంగాణ స్కిల్ యూనివర్శిటీలో ఉపాధి కోర్సులకు నోటిఫికేషన్‌

YISU Admissions:తెలంగాణలో యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీలో పలు కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఐదు కోర్సుల్లో ప్రవేశాలకు తాజా నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో కొన్ని కోర్సుల్లో శిక్షణతో పాటు ఉపాధి కూడా లభిస్తుంది. శిక్షణ సమయంలో స్టైపెండ్‌తో పాటు శిక్షణ పూర్తయ్యాక అయా సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తారు.

yearly horoscope entry point

యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీలో అందించే కోర్సులు ఇవే...

1. టీ వర్క్స్‌ ప్రో టైపింగ్ స్పెషలిస్ట్‌ కోర్స్

పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి రెండు నెలల శిక్షణతో టీ వర్క్స్ ప్రో టైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం అందిస్తున్నారు. 18-25 ఏళ్ల మధ్య వయస్కులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో డిజైన్ థింకింగ్, క్యాడ్, క్యామ్‌లపై అవగాహన, 3డి ప్రింటింగ్‌, వెల్డింగ్, సిఎన్‌సి మెషినింగ్, అడ్వాన్స్‌ ర్యాపిడ్ ప్రో టైపింగ్, ప్యాకెజింగ్, వుడ్, లేజర్ కటింగ్ వంటి అంశాలపై శిక్షణ కల్పిస్తారు. ఈ కోర్సులో అభ్యర్థులకు వర్క్‌మెన్‌ ఇన్స్యూరెన్స్‌, ఇండస్ట్రీ సర్టిఫికెషన్ లభిస్తాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు ఉపాధి కల్పిస్తారు. కనీసం రూ.15-20వేల వేతనాలు లభిస్తాయి. జూనియర్ ప్రోటైపింగ్‌ టెక్నిషియన్ ఉద్యోగాలు లభిస్తాయి.

2. స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్‌ అండ్ ఈ కామర్స్‌( సప్లై చైన్ అసెన్షియల్స్‌ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం)

11 వారాల ఈ కోర్సులో 70శాతం వర్చువల్, 30శాతం క్లాస్ రూమ్‌ సెషన్లు ఉంటాయి. అభ్యర్థులు సొంతంగా ల్యాప్‌ టాప్‌ కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసే అభ్యర్థులుకనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బిఇ, బిటెక్‌, ఎంసిఏ, ఎంబిఏతో పాటు అన్ని ఇంజనీరింగ్ బ్రాంచిల విద్యార్థులు దరఖాస్తుచేసుకోవచ్చు. బ్యాక్‌లాగ్‌ ఉన్న వారిని అనుమతించరు. ఫుల్ టైమ్‌ డిగ్రీలను పూర్తి చేసిన వారిని మాత్రమే చేర్చుకుంటారు.

అడ్మిషన్ సమయంలో రూ.15వేలు ఫీజుగా చెల్లించాలి. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఐటీ అనుబంధ సంస్థల్లో సప్లై ఛైన్ విభాగాల్లో అవకాశాలు కల్పిస్తారు. o9 సొల్యూషన్స్‌ ద్వారా ప్లేస్‌మెంట్స్‌లో సాయం చేస్తారు.

కోర్సు వివరాల కోసం ఈ లింకును అనుసరించండి. https://yisu.in/school-of-logistics-and-e-commerce-2

3. స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిఎఫ్‌ఎస్‌ఐ)

బికాం, బిసిఏ, బిబిఏ, బిఎస్సీ స్టాటస్టిక్స్, మ్యాథ్స్‌, బికాం ఎకనామిక్స్‌, కంప్యూటర్స్‌‌లో 70శాతం మార్కులు సాధించిన విద్యార్ధులు నాలుగు నెలల ఈ కోర్సులో చేరొచ్చు. కంపార్ట్‌‌మెంట్‌లో పాసైన విద్యార్థుల్ని అనుమతించరు. 2023-24 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుకు రూ.5వేలు ఫీజుగా చెల్లించాలి. బ్యాంకింగ్‌, బ్యాంకింగ్‌ అనుబంధ రంగాలపై శిక్షణ ఇస్తారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్‌, రెగ్యులేటరీ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ కంప్లయెన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ రంగాలపై అవగాహన కల్పిస్తారు. కోర్సులో ప్రవేశాలకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలో నెగ్గాల్సి ఉంటుంది.

4. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్‌ అండ్ లైఫ్ సైన్సెస్ (అరబిందో ఫార్మా క్వాలిటీ అనలిస్ట్ ప్రోగ్రాం)

ఆరు నెలల కాల వ్యవధి ఉండే ఈ కోర్సుకు ఇంటర్‌ బైపీసీలో ఉత్తీర్ణులై ఉండాలి. 25ఏళ్లలోపు వయస్కులై ఉండాలి. కోర్సులో భాగంగా ఎండోస్కోపీ పరీక్షలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఖాళీలను బట్టి ఏఐజీ ఆస్పత్రిలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఇతర ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సుకు రూ.10వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కోర్సు కోసం ఈ లింకును అనుసరించండి...

https://yisu.in/school-of-healthcare/#endoscopy-technician

5. అరబిందో ఫార్మా క్వాలిటీ అనలిస్ట్ కోర్సు

స్కిల్ యూనివర్శిటీ కోర్సుల్లో భాగంగా అరబిందో ఫార్మా భాగస్వామ్యంతో ఫార్మా క్వాలిటీ అనలిస్ట్ కోర్సును అందిస్తున్నారు. నాలుగు నెలల ఈ కోర్సుల్లో చేరాలనుకునే వారు 2023, 2024 విద్యా సంవత్సరంలో బీఫార్మసీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే కోర్సు పూర్తి చేసి ఉండాలి. కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైన వారిని అనుమతించరు. పదో తరగతి నుంచి కనీసం 60శాతం మార్కులు సాధించాలి. 6.4జిపిఏ కంటే ఎగువ మార్కులు కలిగి ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో పట్టు ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఈ కోర్సులో శిక్షణా సమయంలో రూ.15వేల స్టైపెండ్ చెల్లిస్తారు. క్లాస్ రూమ్‌ సెషన్లతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్పిస్తారు. ఫార్మాస్యూటికల్స్‌పై ఎండ్‌ టూ ఎండ్ టెస్టింగ్ పై అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సులో భాగంగా హైదరాబాద్‌, వైజాగ్, నాయుడుపేట, బివాండీలో పనిచేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ సమయంలో రూ.5వేల చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్షతో పాటు టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి క్వాలిటీ అనలిస్ట్‌ ట్రైనీగా రూ.2.69లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తారు. గ్రూప్ మెడిక్లెయిమ్‌, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, క్యాంటీన్ సదుపాయాలు కల్పిస్తారు. ఏడాది తర్వాత క్వాలిటీ అనలిస్ట్‌గా నియామకం కల్పిస్తారు. కోర్సు పూర్తైన తర్వాత క్వాలిటీ అనలిస్ట్‌ సర్టిఫికెషన్ అందిస్తారు.

ఈ కోర్సుకు దరఖాస్తు చేయడానికి లింకును అనుసరించండి...

యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీ కోర్సుల వివరాలు, ఫీజులు, విద్యార్హతల వివరాలు, ఉపాధి అవకాశాల కోసం ఈ లింకును అనుసరించండి.

Whats_app_banner

సంబంధిత కథనం