Polavaram Documents: పోలవరం ఎడమ కాల్వ భూసేకరణ దస్త్రాల దగ్ధం.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్, విచారణకు ప్రభుత్వం ఆదేశం
Polavaram Documents: పోలవరం ఎడమ కాల్వ భూసేకరణ దస్త్రాల దగ్దం వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు.ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి ఫైల్స్ ధ్వంసం చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా దగ్దం చేశారు.
Polavaram Documents: పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలో దస్త్రాల దగ్ధం వ్యవహారంలో ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్ లకి జిల్లా కలెక్టర్ షో కాజ్ నోటీసులు జారీ చేశారు. మరో 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్త్రాల దహనం కేసులో జిల్లా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. సీనియర్ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ కళాజ్యోతి, సబార్డినేట్ రాజశేఖర్‌ను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు ఎ. కుమారి, ఎ. సత్యదేవికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ అనుమతి లేకుండా ఫైల్స్ దగ్దం చేయడంపై వారిపై వేటు పడింది.
విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్త్రాలను కాల్చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగానికి చెందిన పలు పత్రాలను కార్యాలయం వెలుపల సిబ్బంది కాల్చేశారు.
ఇది వెలుగు చూడటంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ కార్యాలయ ఉన్నతాధికారులు అనుమతి లేకుండా, వారంతా సెలవులో ఉన్నప్పుడు దస్త్రాలు తగులబెట్టడం, వాటిని కాల్చేసిన స్వీపర్ విశాఖ వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలవరం ఎడమ కాల్వ భూసేకరణకు సంబంధించి రూ.16కోట్ల అక్రమాలపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. బాధితులకు పరిహారం చెల్లించకుండానే రికార్డుల్లో ఇచ్చేసినట్టు నమోదు చేశారు. మరో ఆరు కోట్ల అక్రమాలపై విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారాలపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి.
రికార్డులు ధ్వంసం చేయడానికే పత్రాలను కాల్చేశారనే అనుమానాల నేపథ్యంలో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలోకాగితాలను ముందస్తూ అనుమతి లేకుండా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దహనం చేసి అంశాన్ని విధుల్లో నిర్లక్ష్య వైఖరి గా భావించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో, ఇద్దరూ డిప్యూటీ తహసీల్దార్ లకి షో కాజ్ నోటీసు జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం తెలిపారు.
శనివారం స్థానిక ధవళేశ్వరం పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయ (ఎల్ ఎం సి - ఎల్ ఏ) కార్యాలయ ఆఫీసు కు చెందిన కాగితాలు దహనం ఘటన ను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రాథమిక విచారణలో సంబంధిత పత్రాలు ప్రాధాన్యత లేనివిగా గుర్తించారని, విధుల విషయంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ నిర్వహణ, వాటినీ భద్రపరిచే అంశాల పై అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, జాగ్రత్త వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా , బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిన సంబంధిత అధికారులు, ఉద్యోగులు పై శాఖా పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పోలవరం ఎడమ కుడి కాలవ (ఎల్ ఎ) కార్యాలయనికి చెందిన కొన్ని కాగితాల దహనం చేసిన సీనియర్ అసిస్టెంట్ లు కే. నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యు ఇనస్పెక్టర్ కె. కళా జ్యోతి, ఆఫీసు సభార్డినేట్ కె. రాజశేఖర్ లను సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ లు ఏ. కుమారి, ఏ. సత్య దేవి లకి షో కాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
ఈ విషయంలో సమగ్ర శాఖా పరమైన విచారణ చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఈ ఘటన నేపధ్యంలో ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో చేసిన డిప్యూటీ కలెక్టర్ కె వేదవల్లి ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం పోలీసు స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 211/2024 ఎఫ్ ఐ ఆర్ గా పోలీసులు నమోదు చేశారు. పోలీసు స్టేషన్ లో under section 326 (ఎఫ్) రీడ్ విత్ 3(5) భారతీయ న్యాయ సమ్మత చట్టం మరియు సెక్షన్ 4 ఆఫ్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చట్టం 1984 ను అనుసరించి పోలీసు లు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు, అదే విధంగా శాఖ పరంగా కూడా విచారణ చేపట్టినట్టు కలెక్టర్ తెలిపారు.