Eluru News : భార్యలను కాపురానికి పంపడంలేదని రోడ్డెక్కిన తోడల్లుళ్లు, కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష
Eluru News : తమ భార్యలను కాపురానికి పంపకుండా, మామ మోసం చేశాడని ఇద్దరు తోడల్లుళ్లు నిరాహార దీక్షకు దిగారు. మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Eluru News : 'మా భార్యలను కాపురానికి పంపించాలి' అంటూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఇద్దరు తోడల్లుళ్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పెళ్లిళ్లు అయినా ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి తమపై కేసులు పెట్టి మామ బీకే. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ వేదిస్తున్నాడని ఆరోపిస్తు్న్నారు. మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మామ మోసం చేశాడని, ఇద్దరు తోడల్లుళ్లు శనివారం ఉదయం ఏలూరు కలక్టరేట్ వడ్ఢ రిలే నిరాహార దీక్షకు దిగారు.
తమ భార్యలను ఇంటి వద్ద ఉంచుకుని, తిరిగి తమపైనే కేసులు పెట్టారని అల్లుళ్లు వి. పవన్, పీబీ శేషసాయి వాపోతున్నారు. తమ సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా... ఆయన ఎస్పీని కలవాలని సూచించారన్నారు. ఎస్పీ వద్దకు వెళ్తే డీఎస్పీకి చెప్పారన్నారు. ఎవరు చెప్పినా మా మామయ్య నా భార్యను కాపురానికి పంపించడం లేదని, నా కూతురును చూపించడం లేదని, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడంలేదని పవన్ వాపోయారు. కూతురికి తన గురించి నెగిటివ్‌గా చెబుతున్నారని, పుట్టిన రోజున విష్ చేసిన నెగిటివ్ గా మెసేజ్‌లు పెట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేరే దారి లేక చివరకు ఇలా నిరాహార దీక్షకు దిగినట్టు పవన్ చెబుతున్నారు.
ఏలూరు కలెక్టరేట్‌కు ముందు టెంట్ వేసిన పవన్, శేషసాయి రిలే నిరాహార దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. తమ భార్యలను కాపురానికి పంపించాలి, కన్న కూతురిని తండ్రికి చూపించాలి, కూతుళ్లను కాపురానికి పంపించకుండా అల్లుళ్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, శాడిస్ట్ మామయ్య బీకే శ్రీనివాస రామానుజ అయ్యంగర్‌పై చర్యలు తీసుకోవాలి అంటూ అల్లుళ్లు ఇద్దరూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దీక్షకు దిగారు.
సంబంధిత కథనం