Eluru Crime: ఏలూరు జిల్లాల్లో ఘోరం...ప్రేమ పేరుతో వ‌శ‌ప‌రుచుని బాలిక‌పై అత్యాచారం-eluru shocked inter student accused of raping minor girl ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eluru Crime: ఏలూరు జిల్లాల్లో ఘోరం...ప్రేమ పేరుతో వ‌శ‌ప‌రుచుని బాలిక‌పై అత్యాచారం

Eluru Crime: ఏలూరు జిల్లాల్లో ఘోరం...ప్రేమ పేరుతో వ‌శ‌ప‌రుచుని బాలిక‌పై అత్యాచారం

HT Telugu Desk HT Telugu
Jan 20, 2025 08:42 AM IST

Eluru Crime: ఏలూరు జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బాలిక‌ను ఒక బాలుడు ప్రేమ పేరుతో వ‌శ‌ప‌రుచుకున్నాడు. అనంతరం కిడ్నాప్ చేసి, ఆపై కారులోనే అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో ఆ బాలుడిపై పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది.

ఇంటర్‌ విద్యార్ధినిపై అత్యాచారం
ఇంటర్‌ విద్యార్ధినిపై అత్యాచారం

Eluru Crime: ఏలూరు జిల్లాలో ఇంటర్‌ విద్యార్థినిపై మరో విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న ఏలూరు జిల్లా ద్వారకా తిరుమ‌ల మండ‌లంలోని ఒక గ్రామంలో వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ద్వార‌కా తిరుమ‌ల మండ‌లంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక‌, జంగారెడ్డి గూడెం మండ‌లంలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ కాలేజీల్లో ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్నారు. ఈ క్ర‌మంలో ప్రేమ పేరుతో బాలిక వెంట బాలుడు ప‌డ్డాడు. అలా మంచి మాట‌లు చెప్పి, ఆశ‌లు చూపించి ఆ బాలికును వ‌శ‌ప‌రుచుకున్నాడు.

ఈ క్ర‌మంలో బాలిక‌పై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. సంక్రాంతి సెల‌వులు కావ‌డంతో బాలిక త‌న ఇంటి వ‌ద్ద‌నే ఉంది. దీంతో ఆదివారం కారులో బాలిక గ్రామం వ‌చ్చిన బాలుడు, ఆమెను తనతో తీసుకెళ్లాడు. అనంతరం కారులోనే అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. బాలికను వెదుకుతూ వచ్చిన బాధితురాలి కుటుంబ స‌భ్యులు నిందితుడిని ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు. ఆ బాలుడిపై బాధిత కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు.

రెండో త‌ర‌గ‌తి బాలిక‌పై లైంగిక వేధింపులు

రెండో త‌ర‌గ‌తి బాలిక‌పై లైంగిక వేధింపులు ఘ‌ట‌న చోటు చేసుకుంది. కుక్క పిల్ల‌తో ఆడుకుంటున్న చిన్నారిపై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఈ కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు మండ‌లంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న‌పై పోక్సో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు మండ‌లంలోని ఒక గ్రామంలో రెండో త‌ర‌గ‌తి చ‌దుతోన్న బాలిక ఈనెల 17న కుక్క పిల్ల‌తో త‌న ఇంటి స‌మీపంలో ఆడుకుంటుంది. కుక్క పిల్ల అక్క‌డే స‌మీపంలో ఉన్న ప‌ప్పుల నారాయ‌ణ ఇంట్లోకి వెళ్లింది. దీంతో కుక్క పిల్ల‌ను తెచ్చుకోవ‌డం కోసం బాలిక ఆ ఇంట్లోకి వెళ్లింది. ప‌ప్పుల నారాయ‌ణ అనే వ్య‌క్తి ఆ బాలిక‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు.

దీంతో బాలిక తీవ్ర ఆందోళ‌న‌, భయానికి లోనైంది. వెంట‌నే పెద్ద‌గా కేక‌లు పెట్టింది. బాలిక కేక‌లు విన్న స్థానికులు అక్క‌డుకు చేరుకున్నారు. బాలిక‌ను ప‌ప్పుల నారాయ‌ణ అనే దుర్మార్గుడి చెర నుంచి ర‌క్షించారు. ఆయ‌న దేహ‌శుద్ధి చేశారు. పప్పుల నారాయ‌ణ‌పై బాలిక త‌ల్లిదండ్రులు పెన‌మ‌లూరు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. నిందితుడు నారాయ‌ణ‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner