Krishna District Crime : కృష్ణా జిల్లాలో ఘోరం - ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం..!
కృష్ణా జిల్లాలో ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పపడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారినికి పాల్పడిన వారు అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
కృష్ణా జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి బాలికపై ముగ్గురు గంజాయి బ్యాచ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక దుకాణానికి వెళ్తుంటే బైక్‌పై వచ్చి బాలికను ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి…. నోటిని మూసేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ఈ ఘటన శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మచిలీపట్నంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. తల్లిదండ్రులతో కలిసి సమీపంలోని ఒక గ్రామంలో నివాసం ఉంటుంది. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో బాలిక సమీపంలోని చిల్లర దుకాణానికి వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు దుండగులు వచ్చి అడ్డుకున్నారు.
ఆమెను బలవంతంగా పట్టుకుని కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, నోటిని మూసేసి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఎత్తుకెళ్లారు. పంపుల చెరువు వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. వారితో పాటు మరో దుండగుడు అక్కడి చేరుకున్నారు. ముగ్గురు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానిక యువత, బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు విని, ఆ ప్రాంతానికి పరుగులు తీశారు.
నిందితులు పారిపోవడానికి యత్నం..!
స్థానికులు రావడాన్ని గమనించిన నిందితులు చిన్నారిని వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు వెంటపడి వారిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మరో ఇద్దరు స్థానికులకు చిక్కకుండా పారిపోయారు. బాధిత కుటుంబం సమచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. దీంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక వారికి వివరించింది. స్థానికులు పట్టుకున్న నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న నిందితుల గురించి గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి, మద్యానికి బానిసలు
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలికపై అత్యాచారినికి పాల్పడిన వారు అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికంగా కొంత మంది యువకులు మద్యం, గంజాయి సేవిస్తూ కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే బాలికపై కన్నేసిన గంజాయి బ్యాచ్, శుక్రవారం రాత్రి అపహరించారని తెలుస్తోంది. నిందితులు గంజాయి సేవిస్తారని స్థానికులు తెలిపారు. వారిని కఠినంగా శిక్షించాలని, గంజాయి బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అమ్మాయిలు, బాలికలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ కామాంధులు రెచ్చిపోతున్నారు. పది రోజుల వయసున్న బాలిక నుంచి పండు ముసలి వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. కామవాంఛలు తీర్చుకోవడమే లక్ష్యంగా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. రోజులు, గంటల వ్యవధిలోనే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం