EdCIL Jobs : ఏపీలో 255 ఉద్యోగాల భర్తీకి ఈడీసీఐఎల్ నోటిఫికేష‌న్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి-edcil career mental health counselor 255 vacancies in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Edcil Jobs : ఏపీలో 255 ఉద్యోగాల భర్తీకి ఈడీసీఐఎల్ నోటిఫికేష‌న్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

EdCIL Jobs : ఏపీలో 255 ఉద్యోగాల భర్తీకి ఈడీసీఐఎల్ నోటిఫికేష‌న్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Jan 05, 2025 05:04 PM IST

EdCIL Jobs : ఏపీలో 255 ఉద్యోగాల భర్తీకి ఈడీసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దర‌ఖాస్తు దాఖ‌ల‌కు జ‌న‌వ‌రి 10 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో భ‌ర్తీ చేసే ఈ పోస్టుల‌కు దాఖ‌లు చేయ‌డానికి ఎటువంటి ఫీజు లేదు.

ఏపీలో 255 ఉద్యోగాల భర్తీకి ఈడీసీఐఎల్ నోటిఫికేష‌న్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి
ఏపీలో 255 ఉద్యోగాల భర్తీకి ఈడీసీఐఎల్ నోటిఫికేష‌న్- ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

EdCIL Jobs : ఆంధ్రప్రదేశ్‌లో 255 ఉద్యోగాల భ‌ర్తీకి ఈడీసీఐఎల్‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంది. దర‌ఖాస్తు దాఖ‌ల‌కు జ‌న‌వ‌రి 10 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎడ్యుకేష‌న‌ల్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (ఈడీసీఐఎల్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తుంది. కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో భ‌ర్తీ చేసే ఈ పోస్టుల‌కు దాఖ‌లు చేయ‌డానికి ఎటువంటి ఫీజు లేదు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కెరీర్, మానసిక ఆరోగ్య సలహాదారులు ఈడీసీఐఎల్‌ భర్తీ చేయనుంది.

yearly horoscope entry point

వ‌యో ప‌రిమితి

రాష్ట్రంలోని 26 జిల్లాలో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ల పోస్టులను ఈడీసీఐఎల్‌ భర్తీ చేస్తుంది. వ‌యో ప‌రిమితి 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

అర్హతలు

1. ఎంఎస్సీ సైకాల‌జీ, ఎంఎ సైకాల‌జీ, బిఎ సైకాల‌జీ. అలాగే కెరిర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ డిప్లొమా

2. కౌన్సిలింగ్‌లో అనుభ‌వం క‌నీసం రెండున్నరేళ్లు ఉండాలి (2024 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే అనుభ‌వాన్ని ప‌రిగ‌ణిస్తారు).

3. అభ్యర్థి కంప్యూటర్ (ఎంఎస్‌ వర్డ్, ఎంఎస్‌ ఎక్సెల్ & పవర్ పాయింట్ మొదలైనవి) ప్రెజెంటేషన్ నైపుణ్యాలపై పరిజ్ఞానంతో పాటు మౌఖిక & వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండాలి.

రైటింగ్ స్కిల్స్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ

అభ్యర్థి ఒక వేళ ఒక పోస్టు కంటే ఎక్కువ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే, ప్రతి పోస్టుకు వేర్వేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అక‌డ‌మిక్, ప్రొఫెష‌న‌ల్ అర్హ‌త‌లు, అనుభ‌వంలోని మెరిట్ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేస్తారు. అలాగే రైటింగ్ స్కిల్స్‌పై టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ కూడా నిర్వహిస్తారు.

అప్లొడ్ చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

అర్హత‌లు, అనుభ‌వం, వ‌య‌స్సుకు సంబంధించిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అంద‌జేయాల్సి ఉంటుంది. అలాగే రైటింగ్ స్కిల్స్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ హాజ‌రైన అభ్యర్థులు ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లు తీసుకురావ‌ల్సి ఉంటుంది. అభ్యర్థి విద్యా అర్హత‌, అనుభ‌వం, పాస్‌పోర్టు సైజ్ పోటో, రెజ్యూమ్ త‌దిత‌ర డాక్యుమెంట్ల‌ను పీడీఎఫ్ ఫాంలో అప్లోడ్‌ చేయాలి. అసంపూర్ణంగా ఉండే ద‌ర‌ఖాస్తులు తిర‌స్కరిస్తారు. షార్ట్ లిస్ట్ అయిన‌ అభ్యర్థులకు మాత్రమే, వారి ఈ-మెయిల్స్‌కు ఇంట‌ర్వ్యూ కాల్ లెట‌ర్ పంపిస్తారు.

ద‌ర‌ఖాస్తు ఇలా చేయాలి

ద‌ర‌ఖాస్తును అధికారిక లింక్ https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4OkPgHR_vLxd6n8RCXRd-Ef5_y5Tpiu4ff8fSd28Y795RLw/viewform ద్వారా చేసుకోవాలి. అద‌న‌పు స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.edcilindia.co.in/Default/ViewFile/?id=1735658129556_Advertisement%20for%20engagement%20of%20255%20Career%20and%20Mental%20Health%20counsellors%2C%20purely%20on%20Contractual%20basis.pdf&path=TCareer ను సంప్రదించండి.

ఇత‌ర సందేహాలుంటే ఈ మెయిల్‌ను tsgrecruitment9@gmail.com సంప్రదించండి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం