Trains Information : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్- 8 మెము రైళ్లు పునరుద్ధరణ, 14 రైళ్లకు అదనపు కోచ్‌లు
Trains Information : ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎనిమిది మెము రైళ్లు పునరుద్ధరించింది. మరో 14 రైళ్లకు అదనపు కోచ్ లు పెంచింది.
Trains Information : రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది మెము రైళ్ల సేవలను పునరుద్ధరించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. అలాగే 14 రైళ్లకు అదనపు కోచ్‌లను పెంచింది.
1. రైలు నెంబర్ 07470 విశాఖపట్నం-పలాస రైలు సర్వీస్ మార్చి 1 వరకు (శుక్రవారాలు & ఆదివారాలు మినహా) పునరుద్ధరించారు.
2. రైలు నెంబర్ 07471 పలాస-విశాఖపట్నం రైలు సర్వీస్ మార్చి 1 వరకు (శుక్రవారాలు & ఆదివారాలు మినహా) పునరుద్ధరించారు.
3. రైలు నెంబర్ 67289 విశాఖపట్నం-పలాస రైలు సర్వీస్ జనవరి 1 నుంచి మార్చి 1 వరకు పునరుద్ధరించారు.
4. రైలు నెంబర్ 67290 పలాస-విశాఖపట్నం రైలు సర్వీస్ జనవరి 1 నుంచి మార్చి 1 వరకు అందుబాటులోకి వస్తుంది.
5. రైలు నెంబర్ 07468 విశాఖపట్నం-విజయనగరం రైలు సర్వీస్ ఫిబ్రవరి 28 వరకు (గురువారాలు మినహా) పునరుద్ధరించారు.
6. రైలు నెంబర్ 67287 విశాఖపట్నం- విజయనగరం రైలు సర్వీస్ జనవరి 1 నుంచి మార్చి 1 వరకు అందుబాటులోకి వస్తుంది.
7. రైలు నెంబర్ 07469 విజయనగరం-విశాఖపట్నం రైలు సర్వీస్ మార్చి 1 వరకు (శుక్రవారాలు మినహా) పునరుద్ధరించారు.
8. రైలు నెంబర్ 67288 విజయనగరం-విశాఖపట్నం రైలు సర్వీస్ జనవరి 1 నుంచి మార్చి 1 వరకు అమలులో వస్తుంది. ఈ రైళ్లలో జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-10, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ/ డిసేబుల్డ్ కోచ్-02 ఉంటాయి.
14 రైళ్లకు అదనపు కోచ్‌లు పెంపు
ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి 14 రైళ్లకు అదనపు కోచ్‌లతో రైళ్లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.
1. రైలు నెంబర్ 08522 విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ రైలుకు జనవరి 1 నుండి జనవరి 31 వరకు అదనంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు.
2. రైలు నెంబర్ 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ రైలుకు జనవరి 1 నుండి జనవరి 31 వరకు అదనంగా ఒక స్లీపర్ కోచ్ పెంచారు.
3. రైలు నెంబర్ 18463 భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 1 నుండి జనవరి 31 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌తో పెంచారు.
4. రైలు నెంబర్ 18464 కెఎస్ఆర్ బెంగళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 2 నుండి ఫిబ్రవరి 1 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్ పెంచారు.
5. రైలు నెంబర్ 22879 భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 4 నుంచి జనవరి 25 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్ పెంచారు.
6. రైలు నెంబర్ 22880 తిరుపతి-భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 5 నుంచి జనవరి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్ పెంచారు.
7. రైలు నెంబర్ 20809 సంబల్పూర్-నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 3 నుంచి జనవరి 31 వరకు ఒక థర్డ్ ఏసీ, ఒక స్లీపర్ కోచ్ పెంచారు.
8. రైలు నెంబర్ 20810 నాందేడ్- సంబల్‌పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 4 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఒక థర్డ్ ఏసీ, ఒక స్లీపర్ కోచ్ పెంచారు.
9. రైలు నెంబర్ 08311 సంబల్పూర్-ఈరోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 1 నుండి జనవరి 29 వరకు ఒక థర్డ్ ఏసీ, ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు.
10. రైలు నెంబర్ 08312 ఈరోడ్-సంబల్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 3 నుండి జనవరి 31 వరకు ఒక థర్డ్ ఏసీ, ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు.
11. రైలు నెంబర్ 20837 భువనేశ్వర్-జునాగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 1 నుండి జనవరి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు.
12. రైలు నెంబర్ 20838 జునాగర్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 2 నుండి ఫిబ్రవరి 1 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు.
13. రైలు నెంబర్ 22883 పూరీ-యశ్వంతపూర్ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 3 నుంచి జనవరి 31 వరకు ఒక థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ పెంచారు.
14. రైలు నంబర్ 22884 శ్వంత్‌పూర్-పూరీ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జనవరి 4 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఒక థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ పెంచారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు