East Godavari Viral Video : అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిపై పాశవికంగా దాడి- వీడియో వైరల్
East Godavari Viral Video : అమ్మాయికి మెసేజ్ చేశాడని ఓ యువకుడిపై మరో ముగ్గురు దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. యువకుడి...ముగ్గురు పాశవికంగా దాడి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమ్మాయికి మెసేజ్ చేశాడని ఓ యువకుడిపై ముగ్గురు యువకులు పాశవికంగా దాడి చేశారు. ఓ నిర్మానుష ప్రదేశంలోకి యువకుడ్ని తీసుకెళ్లిన ముగ్గురూ...ఒక్కొక్కరిగా దాడి చేశారు. కొబ్బరిమట్టతో ఓ యువకుడు దాడి చేయగా, మరొకరి గొంతు నులిమి హత్యాయత్నం చేశాడు. బాధిత యువకుడు అమ్మాయి మెసేజ్ చేసినందుకే తాను మెసేజ్ చేసానని చెబుతున్నా వినకుండా విచక్షణారహితంగా యువకుడ్ని కొట్టారు. చివరికి యువకుడి బట్టలు చించి, ఆ చొక్కాను యువకుడి మెడకు బిగించి కాళ్లతో తన్నుతూ దాడి చేశారు.
బాధితుడు తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలోని ఓ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి అని సమాచారం. యువకుడిపై పాశవికంగా దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఎప్పటిది, దాడికి గురైన యువకుడు ఎవరనేదానికి స్పష్టత లేదు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు స్కైబ్ ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది.
ఇన్స్టెంట్ ఖర్మ
ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒక్కడిని చేసి ముగ్గురు అత్యంత పాశవికంగా దాడి చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో కొబ్బరి మట్టతో దాడి చేసిన యువకుడికి అనంతరం యాక్సిడెంట్ అయిందని ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మేయర్ భర్తపై యువకుడు దాడి
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్ భర్త శేఖర్‌పై ఓ ఆటో డ్రైవర్ సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటనను పక్కనున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మేయర్ భర్త దండు శేఖర్ సోమవారం సా యంత్రం నాగారం 80 క్వార్టర్స్‌లోని ఓ మెడికల్ షాపు వద్ద తన అనుచరులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆటోడ్రైవర్ షేక్ రసూల్ అకస్మాత్తుగా శేఖర్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో శేఖర్ కింద పడిపోగా...అతడి కాలితో తన్నా డు. ఆ తర్వాత ఆటోలో ఉన్న పెద్ద సుత్తి తీసి శేఖర్ ను కొట్టాడు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ... సుత్తి బలంగా తగలడంతో శేఖర్ కు తీవ్రగాయమైంది.
తీవ్రగాయంతో రోడ్డు పక్కన పడిపోయిన మేయర్ భర్త శేఖర్‌ను స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి అనంతరం రసూల్ సెల్ఫీ వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. తన భూమిని మేయర్ భర్త శేఖర్ అనుచరుడు గోపాల్ కబ్జా చేశాడని, చాలాసార్లు వేడుకున్నా..అతడు వినలేదని రసూల్ తెలిపాడు. తన భూమిని తిరిగి ఇచ్చేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేశారని, ఆటో నడుపుకొనే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పినా తనను వేధించారన్నారు. ఈ కారణంతో తాను శేఖర్ పై దాడి చేశానని రసూల్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్టు చేసినట్లు సమాచారం.
సంబంధిత కథనం