East Godavari e-Court Jobs : తూర్పుగోదావరి జిల్లా ఈ-కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, నవంబర్ 8 ఆఖరు తేదీ
East Godavari e-Court Jobs : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ-కోర్టుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలు చేయడానికి నవంబర్ 8 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ-కోర్టుల్లో స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్ సంబంధించి వివిధ రకాల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తును ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు దాఖలు చేయడానికి నవంబర్ 8 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
భర్తీ చేసే పోస్టులు
1. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్-1, రాజమహేంద్రవరం.
2. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్-2, రాజమహేంద్రవరం.
3. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్, రైల్వే, రాజమహేంద్రవరం.
4. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్, ఆలమూరు.
5. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్, అమలాపురం.
6. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్-1, కాకినాడ.
7. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్-2, కాకినాడ.
8. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్-3, కాకినాడ.
9. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్, పిఠాపురం.
10. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్, రామచంద్రాపురం.
11. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్, తుని.
12. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్ (13వ ఆర్థిక సంఘం), ప్రత్తిపాడు.
13. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్ (13వ ఆర్థిక సంఘం), కొత్తపేట.
14. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్ (13వ ఆర్థిక సంఘం), రాజోలు.
15. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సెకెండ్ క్లాస్ (13వ ఆర్థిక సంఘం), రంపచోడవరం.
విద్యార్హత
లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, జ్యూడిషల్ సర్వీస్ రిటైర్ అయిన కనీసం ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నావారు దరఖాస్తు దాఖలు చేయడానికి అర్హులు. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసిన వారు, రాష్ట్ర, స్థానిక అథారిటీ సభ్యులు కూడా అనర్హులు.
వయో పరిమితి
45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయస్సు సడలింపు లేదు.
దరఖాస్తు దాఖలు
ఈ పోస్టులకు దరఖాస్తు దాఖలు చేయడానికి నవంబర్ 8 ఆఖరు తేదీగా నిర్ణయించారు. దరఖాస్తును ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdnbbsr.s3waas.gov.in/s3ec01a0ba2648acd23dc7a5829968ce53/uploads/2024/10/2024102153.pdf ను క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి. అనంతరం అప్లికేషన్ పూర్తి చేసి, దానికి సర్టిఫికేట్లు జత చేసి నవంబర్ 8 తేదీన సాయంత్ర 5 గంటల లోపు అందజేయాలి. అలాగే ఇతర అదనపు సమాచారం కోసం పై లింక్‌ను సంప్రదించాలి.
వేతనం
ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం రూ.45 వేలు లభిస్తుంది. జీతంతో పాటు రూ.5,000 కన్వియన్స్ ఫీజు చెల్లిస్తారు.
ఎంపిక విధానం
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వయస్సు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ ప్రక్రియ ఉంటుంది.
అవసరమైన ధ్రువీకరణ పత్రాలు
1. విద్యార్హత
2. అనుభవం సర్టిఫికేట్
3. కుల ధ్రువీకరణ పత్రం
4. ఆధార్ కార్డు
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం