Visakha Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, విశాఖ-దానాపూర్ మధ్య రెండు స్పెషల్ ట్రైన్స్, నాలుగు రైళ్లు రీషెడ్యూల్
Visakha Special Trains : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విశాఖ-దానాపూర్-విశాఖ మధ్య ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. మరో నాలుగు రైళ్లను రీషెడ్యూల్ చేసింది.
ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం- దానాపూర్- విశాఖపట్నం నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. అలాగే నాలుగు రైళ్లను రీషెడ్యూల్ చేసింది.
1. విశాఖపట్నం - దానాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08520) రైలు విశాఖపట్నం నుంచి శుక్రవారం (నవంబర్ 8) ఉదయం 9:10 గంటలకు బయలుదేరుతుంది. అక్కడ నుంచి సింహాచలం ఉదయం 9:25 గంటలకు చేరుకుంటుంది. సింహాచలం నుంచి ఉదయం 9:27 గంటలకు బయలుదేరి, విజయనగరం ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 10:05 గంటలకు బయలుదేరి, శ్రీకాకుళం రోడ్డుకు ఉదయం 11 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 11:02 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం (శనివారం) 11:00 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.
2. దానాపూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08519) రైలు దానాపూర్ నుంచి శనివారం (నవంబర్ 9) 12:30 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12:55 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 12:57 గంటలకు బయలుదేరి, విజయనగరం మధ్యాహ్నం 1:55 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, సింహాచలం మధ్యాహ్నం 2:40 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:42 గంటలకు బయలుదేరి, విశాఖపట్నం మధ్యాహ్నం 3:45 గంటలకు చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు విశాఖపట్నం నుంచి ధనపూర్ మధ్య సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పుర్‌కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, హిజ్లీ, మిడ్నాపూర్, బంకురా, అద్రా, అస్న్సోల్, చిత్తరంజన్, మధుపూర్, జసిడ్హా రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రెండు రైళ్లకు థర్డ్ ఏసీ కోచ్‌లు-2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-12, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-5, సెకండ్ క్లాస్ కమ్ దివ్యాంగజన్ కోచ్‌లు -2 ఉన్నాయి.
నాలుగు రైళ్లు రీషెడ్యూల్
ఖుర్దా రోడ్ డివిజన్‌లోని సోంపేట-జాదుపూడి-ఇచ్ఛాపురం సెక్షన్‌లో సేఫ్టీ పనుల దృష్ట్యా డిసెంబర్ 4 వరకు సోమవారాలు, గురువారాలు, శనివారాల్లో ప్రయాణించే నాలుగు రైలు సర్వీసులు రీషెడ్యూల్ చేశారు.
1. పుదుచ్చేరి - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12897) రైలు నవంబర్ 6, 13, 20, 27 తేదీలలో సాయంత్రం 6:50 గంటలకు బయలుదేరే బదులు, రెండు గంటల ఆలస్యంగా రాత్రి 8:50 గంటలకు పుదుచ్చేరి నుంచి బయలుదేరుతుంది.
2. కేఎస్ఆర్ బెంగళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) రైలు నవంబర్ 6, 8, 10, 13, 15, 17, 20, 22 తేదీలలో, డిసెంబర్ 1, 3 తేదీల్లో కేఎస్ఆర్ బెంగళూరు నుంచి మధ్యాహ్నం 1:40 గంటలకు బయలుదేరే బదులు, 2.15 గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 3:55 గంటలకు బయలుదేరుతుంది.
3. రామేశ్వరం - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20895) రైలు నవంబర్ 10, 17, 24 తేదీల్లోనూ, డిసెంబర్ 1 తేదీన రామేశ్వరం నుంచి ఉదయం 8ః40 గంటలకు బయలుదేరే బదులు, రెండు గంటల ఆలస్యంగా ఉదయం 10.40కి బయలుదేరుతుంది.
4. సికింద్రాబాద్-బ్రహ్మాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07027) రైలు నవంబర్ 8, 15, 22, 29 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 10.15 గంటలకు బయలుదేరే బదులు, రెండు గంటల ఆలస్యంగా అర్ధరాత్రి 12.15 గంటలకు బయలుదేరుతుంది. ప్రజలు, ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం