Visakha Mahakumbh Trains : విశాఖ నుంచి మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన
Visakha Mahakumbh Trains : మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఈస్ట్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం- గోరఖ్‌పూర్- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
Visakha Mahakumbh Trains : మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను తూర్పుకోస్ట్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం- గోరఖ్‌పూర్- విశాఖపట్నం మహాకుంభ మేళా స్పెషల్ రైళ్లను నడపడానికి నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు తూర్పు కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.
మహా కుంభమేళాకు స్పెషల్ రైళ్లు
రైలు నెంబర్ 08588 విశాఖపట్నం- గోరఖ్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 4 (మంగళవారం)తేదీన రాత్రి 10:20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 6 (గురువారం) తేదీన రాత్రి 7.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది.
రైలు నెంబర్ 08587 గోరఖ్‌పూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 7 (శుక్రవారం) తేదీన సాయంత్రం 5.45 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 9 (ఆదివారం) మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం- గోరఖ్‌పూర్ మధ్య విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఛత్రపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, నారాజ్ మార్తాపూర్, దెంకనల్. అంగుల్, బోయిండా, రైరాఖోల్, సంబల్‌పూర్ సిటీ, ఝార్సుగూడ రోడ్, రాయ్‌గఢ్, చంపా, బిలాస్‌పూర్, పెండ్రా రోడ్, అనుప్పూర్, షాడోల్, ఉమారియా, కట్నీ, మహిర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, మిరాజ్‌పూర్, చునార్, వారణాసి, జౌన్‌పూర్, ఔన్రిఖ్‌పూర్, ఔన్రిహరియాపట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో సెకెండ్ ఏసీ కోచ్‌లు -4, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -3, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని తూర్పు కోస్ట్ రైల్వే అభ్యర్థించింది.
రైళ్ల షార్ట్ టెర్మినేషన్
సాంకేతిక కారణాల వల్ల నాలుగు రైళ్లను షార్ట్‌టెర్మినేషన్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే పేర్కొంది.
1. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 67287 విశాఖపట్నం-పార్వతీపురం ప్యాసింజర్ రైలు విజయనగరం వద్ద ఆగిపోతుంది.
2. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు రైలు నెంబర్ 67288 పార్వతీపురం-విశాఖపట్నం ప్యాసింజర్ రైలు పార్వతీపురం నుంచి బయలుదేరడానికి బదులు విజయనగరం నుంచి బయలుదేరుతుంది.
3. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 67289 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు శ్రీకాకుళం రోడ్ వద్ద ఆగిపోతుంది.
4. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు రైలు నెంబర్ 67290 పలాస-విశాఖపట్నం ప్యాసింజర్ రైలు పలాస నుండి బయలుదేరడానికి బదులు శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుంది. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం