Sabarimala Trains : శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ రైళ్లకు అదనపు కోచ్‌లు
Sabarimala Trains : శబరిమల భక్తులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తులకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి.. అదనపు కోచ్‌లతో పెంచాలని నిర్ణయించింది. అటు 18 రైళ్లు రద్దయ్యాయి. వాటి వివరాలను కూడా అధికారులు వెల్లడించారు.
శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరే శ్రీకాకుళం రోడ్- కొల్లాం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08553) రైలుకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు. ఈ అదనపు కోచ్ పెంపు డిసెంబర్ 8 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి ఈ రైలు 2025 జనవరి 26 వరకు అందుబాటులో ఉంటుంది. రైలు ఆదివారాల్లో ఉదయం 6.00 గంటలకు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
కొల్లాంలో బయలుదేరే కొల్లాం- శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08554) రైలుకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచారు. ఈ అదనపు కోచ్ పెంపు డిసెంబర్ 9 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి ఈ రైలు 2025 జనవరి 27 వరకు అందుబాటులో రానుంది. ఈ రైలు సోమవారాల్లో సాయంత్రం 4.30 గంటలకు కొల్లాం నుండి బయలుదేరుతుంది. బుధవారం అర్థరాత్రి 2.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే..
ఈ రెండు ప్రత్యేక రైళ్లు శ్రీకాకుళం-కొల్లాం మధ్య పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, ఈరోడ్, జోలార్‌పేట, పోదనూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగనస్సేరి, తిరువాల, చెంగన్నూర్, మావేలికర, కాయంకులం రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. ఈ రైళ్లలో నాలుగు సెకండ్ క్లాస్, ఎనిమిది స్లీపర్ క్లాస్, ఆరు థర్డ్ ఏసీ ఎకానమీ, ఒక సెకండ్ ఏసీ కోచ్, ఒక సెకండ్ క్లాస్ సిట్టింగ్ కమ్ లగేజీ/ దివ్యాంగజన్, ఒక లగేజీ/జనరేటర్/బ్రేక్ వాన్ కోచ్‌లు ఉంటాయి.
చెన్నై రైళ్లకూ..
1. సంబల్‌పూర్‌లో బయలుదేరే సంబల్‌పూర్-ఈరోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08311) రైలుకు డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 25 వరకు ఒక థర్డ్ ఏసీ, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లను పెంచనున్నారు.
2. ఈరోడ్‌లో బయలుదేరే ఈరోడ్-సంబల్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08312) రైలుకు డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 27 వరకు ఒక థర్డ్ ఏసీ, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లను పెంచనున్నారు.
ఈ రెండు రైళ్లు పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతాయి. ఈ రెండు రైళ్లలో సెకెండ్ ఏసీ-1, థర్డ్ ఏసీ-3, స్లీపర్ క్లాస్-9, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్‌లు-2 ఉన్నాయి.
రైళ్లు రద్దు..
రైల్వే ప్రయాణికులకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే అలర్ట్ ప్రకటించింది. వివిధ పనులు కారణంగా 18 రైళ్లను రద్దు చేసింది. ఖుర్దా రోడ్ డివిజన్‌లో మూడో లైన్‌ను ప్రారంభించేందుకు సంబంధించి.. భద్రక్ స్టేషన్‌లో ప్రీ నాన్-ఇంటర్‌లాకింగ్, నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా18 రైళ్లు రద్దు చేశారు.
1. డిసెంబర్ 12న విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 22874 విశాఖపట్నం-దిఘా ఎక్స్‌ప్రెస్ రద్దైంది.
2. డిసెంబర్ 13న దిఘా నుండి బయలుదేరే రైలు నెంబర్ 22873 దిఘా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దైంది.
3. షాలిమార్‌లో బయలుదేరే రైలు నెంబర్ 22853 షాలిమార్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు డిసెంబర్ 10 నుంచి 17 వరకు రద్దు చేశారు.
4. విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 22854 విశాఖపట్నం- షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలును డిసెంబర్ 11 నుంచి 19 వరకు రద్దు చేశారు.
5. డిసెంబర్ 14న హౌరా నుండి బయలుదేరే రైలు నెంబర్ 20889 హౌరా-తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు.
6. డిసెంబర్ 15న తిరుపతి నుండి బయలుదేరే రైలు నెంబర్ 20890 తిరుపతి-హౌరా ఎక్స్‌ప్రెస్ రద్దు అయ్యింది.
7. డిసెంబర్ 10, 13, 17 తేదీల్లో తిరుచ్చిరాపల్లి నుండి బయలుదేరే రైలు నెంబర్ 12664 తిరుచ్చిరాపల్లి-హౌరా ఎక్స్‌ప్రెస్ రద్దు అయ్యింది.
8. డిసెంబర్ 12, 15, 19 తేదీల్లో హౌరా నుండి బయలుదేరే రైలు నెంబర్ 12663 హౌరా-తిరుచ్చిరాపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు అవుతుంది.
9. డిసెంబర్ 10, 13, 17 తేదీల్లో సంత్రాగచ్చి నుండి బయలుదేరే రైలు నెంబర్ 22807 సంత్రాగచ్చి- జీఎంఆర్ చెన్నై సెంట్రల్ రద్దు అయ్యింది.
10. డిసెంబర్ 12, 15, 19 తేదీల్లో జీఎంఆర్ చెన్నై సెంట్రల్ బయలుదేరే రైలు నెంబర్ 22808 జీఎంఆర్ చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు.
11. కన్యకుమారి నుండి బయలుదేరే రైలు నెంబర్ 12666 కన్యకుమారి- హౌరా సూఫర్ ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 14న రద్దు చేశారు.
12. హౌరాలో బయలుదేరే రైలు నెంబర్ 12665 హౌరా- కన్యకుమారి ఎక్స్‌ప్రెస్ రైలును డిసెంబర్ 16న రద్దు చేశారు.
13. హౌరాలో బయలుదేరే రైలు నెంబర్ 12867 హౌరా-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలును డిసెంబర్ 8, 15 తేదీల్లో రద్దు చేశారు.
14. పుదుచ్చేరి నుండి బయలుదేరే రైలు నెంబర్ 12868 పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు డిసెంబర్ 11, 18 రద్దు కానుంది.
15. డిసెంబర్ 15న సంత్రాగచ్చి నుండి బయలుదేరే రైలు నెంబర్ 22855 సంత్రాగచ్చి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రద్దు అయ్యింది.
16. డిసెంబర్ 16న తిరుపతి నుండి బయలుదేరే రైలు నెంబర్ 22856 తిరుపతి-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ రద్దు కానుంది.
17. డిసెంబర్ 10, 17 తేదీలలో షాలిమార్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 22825 షాలిమార్- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు.
18. డిసెంబర్ 11, 18 తేదీల్లో ఎంజీఆర్ చెన్నై సెంట్ర్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 22826 జీఎంఆర్ చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)