Maha Kumbh Mela Special Trains : మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్-విశాఖ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela Special Trains : మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. విశాఖ నుంచి రాకపోకలు నిర్వహించే ఈ రైళ్లను కొత్తవలసలో కూడా ఆపనున్నారు.
Maha Kumbh Mela Special Trains : కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. మహాకుంభ మేళాకు వెళ్లే యాత్రికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను తూర్పుకోస్ట్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం నుంచి రాకపోకలు నిర్వహించే ఈ రైళ్లను కొత్తవలసలో కూడా ఆపనున్నారు. సాధారణంగా కొత్తవలసలో స్పెషల్ రైళ్లు ఆపరు. కానీ ప్రజల నుంచి వచ్చి విజ్ఞప్తుల మేరకు ఈ రైళ్లను కొత్తవలస రైల్వే స్టేషన్‌లో కూడా ఆపుతారని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.

విశాఖపట్నం- గోరఖ్‌పూర్- విశాఖపట్నం స్పెషల్ రైళ్లు
1. ఫిబ్రవరి 16 (ఆదివారం)న విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 08562 విశాఖపట్నం- గోరఖ్‌పూర్ మహాకుంభ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం (ఫిబ్రవరి 18) రాత్రి 8:25 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది.
2. రైలు నెంబర్ 08561 గోరఖ్‌పూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 19 (బుధవారం) మధ్యాహ్నం 2:20 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరుతుంది. శుక్రవారం (ఫిబ్రవరి 21) మధ్యాహ్నం 12:15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
స్పెషల్ రైళ్లు
1. రైలు నెంబర్ 08530 విశాఖపట్నం-దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారాల్లో (ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 27 తేదీల్లో) సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. శనివారాల్లో ఉదయం 4.30 గంటలకు చేరుకుంటుంది.
2. రైలు నెంబర్ 08529 దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శనివారం వారాల్లో (ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 22, మార్చి 1 తేదీల్లో) రాత్రి 8:10 గంటలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నుంచి బయలుదేరుతుంది. సోమవారం ఉదయం 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ప్రజలు ఈ ప్రత్యేక రైలు సేవలను ఉపయోగించుకోవాలని, సురక్షితమైన ప్రయాణ పద్ధతులను అవలంబించాలని కె.సందీప్ కోరారు.
రైళ్ల షార్ట్-టెర్మినేషన్
వాల్తేర్ డివిజన్‌లోని కొత్తవలస-కిరండూల్ సెక్షన్‌పై పరిమిత ఎత్తు సబ్‌వే పనులు, టాక్ మెషీన్‌లతో పాయింట్ ఫార్మేషన్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి భద్రత ఆధునీకరణ పనుల కోసం నాలుగు రైళ్లు షార్ట్-టెర్మినేటెడ్ చేస్తున్నారు.
1. జనవరి 30న విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 58501 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ రైలు కోరాపుట్ వద్ద స్వల్పకాలికంగా నిలిపివేస్తారు.
2. జనవరి 30న రైలు నెంబర్ 58502 కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ రైలు కిరండూల్‌కు బదులుగా కోరాపుట్ నుండి బయలుదేరుతుంది.
3. జనవరి 29న రూర్కెలా నుండి బయలుదేరే రైలు నెంబర్ 18107 రూర్కెలా-జగ్దల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కోరాపుట్ వద్ద స్వల్పకాలికంగా నిలిపివేస్తారు.
4. జనవరి 30న జగదల్‌పూర్‌కు బదులుగా రైలు నెంబర్ 18108 జగ్దల్‌పూర్-రూర్కెలా ఎక్స్‌ప్రెస్ రైలు జగ్దల్‌పూర్‌కు బదులుగా కోరాపుట్ నుండి బయలుదేరుతుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు