Trains Information : రైల్వే ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్- 14 రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు, రెండు రైళ్లు పునరుద్ధరణ-east coast railway added 14 trains additional coaches due to rush two trains restoration ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Information : రైల్వే ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్- 14 రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు, రెండు రైళ్లు పునరుద్ధరణ

Trains Information : రైల్వే ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్- 14 రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు, రెండు రైళ్లు పునరుద్ధరణ

HT Telugu Desk HT Telugu
Nov 13, 2024 07:13 PM IST

Trains Information : ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే 14 రైళ్లకు అదనపు కోచ్ లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. మరో రెండు రైళ్లను పునరుద్ధరించింది.

రైల్వే ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్- 14 రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు, రెండు రైళ్లు పునరుద్ధరణ
రైల్వే ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్- 14 రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు, రెండు రైళ్లు పునరుద్ధరణ

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి 14 రైళ్లకు అదనపు కోచ్‌లు పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. అలాగే ర‌ద్దు అయిన రెండు రైళ్లను పునరుద్ధరించింది. నాలుగు రైళ్లను షార్ట్ టెర్మినేష‌న్ చేసింది.

1. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463) రైలుకు న‌వంబ‌ర్ 14 నుంచి న‌వంబ‌ర్ 21 వరకు రెండు థ‌ర్డ్‌ ఏసీ క్లాస్ కోచ్‌లు పెంచ‌నున్నారు.

2. కేఎస్ఆర్ బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) రైలుకు న‌వంబ‌ర్ 15 నుంచి న‌వంబ‌ర్ 22 వరకు రెండు థ‌ర్డ్‌ ఏసీ క్లాస్ కోచ్‌లు పెంచ‌నున్నారు.

3. భువనేశ్వర్-తిరుపతి సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22879) రైలుకు న‌వంబ‌ర్ 16 నుంచి రెండు థ‌ర్డ్ ఏసీ క్లాస్ కోచ్‌లు పెంచ‌నున్నారు.

4. తిరుపతి - భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22880) రైలుకు న‌వంబ‌ర్ 17 నుంచి రెండు థ‌ర్డ్ ఏసీ క్లాస్ కోచ్‌లు పెంచ‌నున్నారు.

5. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ (20805) రైలుకు న‌వంబ‌ర్‌ 15 నుంచి న‌వంబ‌ర్ 30 వరకు ఒక సెకెండ్ ఏసీ క్లాస్ కోచ్‌తో పెంచనున్నారు.

6. న్యూఢిల్లీ-విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ (20806) రైలుకు న‌వంబ‌ర్ 17 నుంచి డిసెంబ‌ర్ 2 వరకు ఒక సెకెండ్ ఏసీ క్లాస్ కోచ్‌తో పెంచనున్నారు.

7. విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినల్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22847) రైలుకు న‌వంబ‌ర్ 24 నుంచి ఒక థ‌ర్డ్ ఏసీ క్లాస్ కోచ్‌తో పెంచనున్నారు.

8. లోకమాన్య తిలక్ టెర్మిన‌ల్‌ – విశాఖపట్నం సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22848) రైలుకు న‌వంబ‌ర్ 26 నుంచి ఒక థ‌ర్డ్ ఏసీ క్లాస్ కోచ్‌తో పెంచనున్నారు.

9. విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినల్‌ ఎక్స్‌ప్రెస్ (18519) రైలుకు న‌వంబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 30 వరకు ఒక‌ థ‌ర్డ్ ఏసీ క్లాస్ కోచ్ పెంచ‌నున్నారు.

10. లోకమాన్య తిలక్ టెర్మినల్‌ - విశాఖపట్నం (18520) రైలుకు న‌వంబ‌ర్ 27 నుంచి డిసెంబ‌ర్ 2 వరకు ఒక‌ థ‌ర్డ్ ఏసీ క్లాస్ కోచ్ పెంచ‌నున్నారు.

11. విశాఖపట్నం-దిఘా సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22874) రైలుకు న‌వంబ‌ర్ 28 నుంచి ఒక థ‌ర్డ్ ఏసీ క్లాస్ కోచ్ పెంచ‌నున్నారు.

12. దిఘా- విశాఖపట్నం సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22873) రైలుకు న‌వంబ‌ర్ 29 నుంచి ఒక థ‌ర్డ్ ఏసీ క్లాస్ కోచ్ పెంచ‌నున్నారు.

13. గాంధీధామ్-పూరి సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22973) రైలు న‌వంబ‌ర్ 20, 27 తేదీలలో ఒక స్లీపర్ క్లాస్ కోచ్ పెంచ‌నున్నారు.

14. పూరీ-గాంధీధామ్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22974) రైలు న‌వంబ‌ర్ 23, 30 తేదీల్లో ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్ పెంచ‌నున్నారు.

విశాఖపట్నం-గుణపూర్ రైలు పునరుద్ధరణ

నౌపడ-గుణపూర్ లైన్‌లో భద్రతా పనుల కారణంగా నామినేటెడ్ రోజులలో అంటే బుధ, శని, ఆదివారాల్లో న‌వంబర్ 13 నుంచి న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు రద్దు చేయాలని ప్రతిపాదించిన విశాఖపట్నం-గుణపూర్ ప్యాసింజర్ ప్రత్యేక సర్వీసులను పునరుద్ధరించారు. అయితే ఈ రైలు సేవలు నౌపడ వరకు అందుబాటులో ఉంటాయి.

1. విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం - గుణుపూర్ ప్యాసింజర్ (08522) ప్రత్యేక రైలు న‌వంబ‌ర్ 16, 17, 20, 23, 24 తేదీలలో నౌపడ వద్ద షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది.

2. గుణుపూర్ నుంచి బ‌య‌లుదేరే గుణుపూర్ - విశాఖపట్నం ప్యాసింజర్ (08521) స్పెషల్ రైలు న‌వంబ‌ర్ 16, 17, 20, 23, 24 తేదీల్లో గుణపూర్‌కు బదులుగా నౌపాడా నుంచి ప్రారంభమవుతుంది.

రైళ్ల షార్ట్ టెర్మినేష‌న్‌

1. రుర్కెలా నుంచి బ‌యలుదేరే రూర్కెలా-గుణపూర్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (18117) రైలు న‌వంబ‌ర్‌ 12, 15, 16, 19, 22, 23 తేదీలలో పలాసలో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది.

2. గుణుపూర్ నుంచి బ‌య‌లుదేరే గుణుపూర్ -రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ (18118) రైలు న‌వంబ‌ర్‌ 13, 16, 17, 20, 23, 24 తేదీలలో పలాస నుంచి బయలుదేరుతుంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner