Summer Special Trains : వేసవి రద్దీ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. విశాఖ-బెంగళూరు, విశాఖ- తిరుపతి, విశాఖ- కర్నూలు సిటీ మధ్య మొత్తం 42 వేసవి వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు ఈ సమ్మర్ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
1. విశాఖపట్నం - బెంగళూరు(ట్రైన్ నెం. 08581) : 13.04.25 నుంచి 25.05.25 వరకు - 07 సర్వీసులు
2. బెంగళూరు - విశాఖపట్నం (ట్రైన్ నెం. 08582) : 14.04.25 నుంచి 26.05.25 వరకు - 07 సర్వీసులు
3 . విశాఖపట్నం-తిరుపతి(ట్రైన్ నెం.08547) -16.04.25 నుండి 28.05.25 వరకు - 07 సర్వీసులు
4. తిరుపతి - విశాఖపట్నం(ట్రైన్ నెం.08548 ) - 17.04.25 నుండి 29.05.25 వరకు - 07 సర్వీసులు
5 . విశాఖపట్నం - కర్నూలు సిటీ (ట్రైన్ నెం.08545) -15.04.25 నుండి 27.05.25 వరకు - 07 సర్వీసులు
6. కర్నూలు సిటీ - విశాఖపట్నం(ట్రైన్ నెం. 08546 ) -16.04.25 నుండి 28.05.25 వరకు - 07 సర్వీసులు
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలిమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్ పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలిమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకులూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, మార్కాపూర్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
సంబంధిత కథనం