Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తీవ్ర జ్వరం, రేపటి కేబినెట్ భేటీకి డౌట్
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో ఇబ్బంది పడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. దీంతో రేపటి కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేకపోవచ్చని చెప్పింది.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో ఇబ్బందిపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. పవన్ జ్వరంతోపాటు స్పాండిలైటిస్ తో బాధపెడుతున్నారని వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అనారోగ్య కారణంగా గురువారం నాటి కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేకపోవచ్చని డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటించింది.

రేపు కేబినెట్ భేటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. రేపు రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో కీలక అజెండాపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. విశాఖలోని పంచగ్రామాల సమస్యకు పరిష్కారంగా ఆ భూములకు ప్రత్యమ్నాయంగా అదే విలువ కలిగిన భూములు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి కేబినెట్‌లో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ లో ఆమోదించిన 44,776 కోట్ల రూపాయల విలువైన 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
ఈ నెలాఖరులో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు, కేంద్ర పథకాల్లో ఏవిధంగా లబ్ది పొందాలో మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై జిల్లాల మంత్రుల, ఇంఛార్జ్ మంత్రులతో చర్చిoచే ఛాన్స్ ఉంది.
సంబంధిత కథనం