Dy CM Pawan Kalyan : అధికారుల తీరుపై పవన్ కల్యాణ్ అసహనం, తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్-dy cm pawan kalyan strong warning to officials in collectors meeting on smuggling ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dy Cm Pawan Kalyan : అధికారుల తీరుపై పవన్ కల్యాణ్ అసహనం, తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్

Dy CM Pawan Kalyan : అధికారుల తీరుపై పవన్ కల్యాణ్ అసహనం, తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్

Bandaru Satyaprasad HT Telugu
Dec 11, 2024 03:01 PM IST

Dy CM Pawan Kalyan : తప్పులు జరుగుతున్నా వద్దని చెప్పకపోవడం నేడు రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అధికారుల తీరుపై పవన్ కల్యాణ్ అసహనం, తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్
అధికారుల తీరుపై పవన్ కల్యాణ్ అసహనం, తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్

Dy CM Pawan Kalyan : అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన పవన్ కల్యాణ్... కాకినాడ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ రవాణా జరుగుతుందంటే ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదన్నారు. అది కలెక్టర్ల బాధ్యత కాదా? ఎస్పీ బాధ్యత కాదా? ఎలా వదిలేశారు? చాలా నిరాశాజనకంగా ఉందన్నారు. నిస్వార్థంగా ప్రజల కోసం పని చేస్తున్నా అధికారుల నుంచి సహకారం ఉండట్లేదన్నారు. విజిలెన్స్ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తే మంత్రి నాదెండ్ల వెళ్లి సీజ్ చెయ్యాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.

"మళ్ళీ చెప్తున్నా మేము రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. పరిస్థితులు తిరిగి గాడిలో పెట్టాలి. మొన్న దిల్లీలో కూడా కేంద్ర నాయకత్వం, కేంద్ర బ్యూరోక్రసీ ఒకటే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీకి మోడల్ స్టేట్ గా నిలిచేది. అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు ఉండాలని అనుకునే స్థాయి నుంచి ఎలా ఉండకూడదో అనే స్థాయికి దిగజారింది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో సరైన బ్యూరోక్రసికి ఉదాహరణగా నిలిచేలా చేయమని అధికారులను కోరుతున్నాను"- పవన్ కల్యాణ్

అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కల్తీలపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు డైనమిక్ లీడర్ షిప్‌లో ఏపీలో సుస్థిర పాలనను అందిచేందుకు అధికారుల సహకారం అందించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

ఆర్థిక అక్రమాలు

"గత ప్రభుత్వం చేసిన తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయి. వీటిని సరిదిద్దడానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా విభేదాలను కూడా పక్కన పెట్టాం. దీని వెనుక ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజలకు ఇబ్బందులని తొలగించాలి అని కూటమి కట్టాము. నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు గతంలో చాలా ఆర్థిక అక్రమాలు రూల్ బుక్ పాటించకుండా చేసినవి మా దృష్టికి వచ్చాయి. గత ప్రభుత్వం రెవెన్యూ అధికారులను చాలా ఇబ్బందులు పెట్టింది.రెవెన్యూ అధికారులను పెట్టి సినిమా టికెట్లు అమ్మించడం, ఇసుక దోపిడీ, ఇంకా అనేక అక్రమాలు జరిగాయి. అధికారంలో లేనప్పుడు సామన్యుడిలా బయట నుంచి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇంత మంది ఐఎస్ అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు కానీ ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఏంటి? ఐఏఎస్ చదివి, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం అనిపించింది."- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కటువుగానే చెప్తున్నా

గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయి అని తెలిసినా వద్దు అని చెప్పలేని పరిస్థితి అన్నారు. తప్పులు జరుగుతున్నా వద్దని చెప్పకపోవడం వల్ల నేడు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందన్నారు. జనసేన పార్టీ ఆఫీసు దగ్గరకొచ్చి జనం సమస్యలు చెప్తుంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోయామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల సత్యసాయి జిల్లాలోని వాటర్ సప్లై ఉద్యోగులకు నెలలు తరబడి జీతాలు ఇవ్వలేదంటే అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని 30 కోట్ల రూపాయలు వారి జీతాలకు విడుదల చేశారన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం