AP TET Results 2024 Updates : ఏపీ టెట్ ఫలితాలు(Download AP TET Score Card) రానున్నాయి. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 14వ తేదీ నుంచి వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే పరీక్షలను పూర్తి చేసిన విద్యాశాఖ.... ప్రాథమిక కీ లను కూడా విడుదల చేసింది. వీటిల్లో ఉండే అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఇందులో భాగంగా మార్చి 13వ తేదీన ఫైనల్ కీని విడుదల చేస్తుంది. ఇక మార్చి 14వ తేదీన తుది ఫలితాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చని ఏపీ విద్యాశాఖ తెలిపింది.
ఏపీ టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
మీ టెట్ స్కోర్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఏపీ టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోమ్ పేజీలో కనిపించే Question Papers & keys అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
కీ పేపర్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
AP DSC 2024 Updates : ఏపీ డీఎస్సీ పరీక్షకు సంబంధించి కీలక మార్పులు చేసింది ఏపీ విద్యాశాఖ. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువుపై ఇటీవలే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కొత్త షెడ్యూల్(AP DSC New Schedule 2024) ను ప్రకటించింది. ఫలితంగా మార్చి 30 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.