TTD Tokens: తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి..-distribution of vaikuntha dwara darshan tokens for the first three days in tirumala has been completed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Tokens: తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి..

TTD Tokens: తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి..

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 09, 2025 11:30 AM IST

TTD Tokens: తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తైంది. కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేశారు. 3 రోజులకు లక్షా 20 వేల టోకెన్లను టీటీడీ జారీ చేసింది. రోజుకు 40 వేల చొప్పున టోకెన్లు జారీ చేసింది. 13వ తేదీ నుంచి తిరిగి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ పూర్తి
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ పూర్తి (image source twitter)

TTD Tokens: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తైంది. టిక్కెట్ల కోటా పూర్తి కావడంతో కౌంటర్లు మూసివేశారు. 3 రోజులకు లక్షా 20 వేల టోకెన్లను టీటీడీ జారీ చేసింది. రోజుకు 40 వేల చొప్పున టోకెన్లు జారీ చేసింది. 13వ తేదీ నుంచి తిరిగి టోకెన్లు జారీచేయనున్నారు. గురువారం ఉదయం నుంచి టోకెన్ల పంపిణీ ప్రారంభం కావాల్సి ఉన్నా, భక్తుల రద్దీ పెరగడంతో బుధవారం రాత్రి నుంచి టోకెన్ల పంపిణీ చేపట్టారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం దాదాపు 7లక్షల మంది భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.

yearly horoscope entry point

వైకుంఠ ద్వార దర్శనాల కోసం వచ్చే భక్తులు ముందే టైమ్ స్లాట్‌ టోకెన్లను పొందాల్సి ఉంటుందని ప్రకటించడంతో రెండు రోజుల ముందే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి తరలి వచ్చారు. తిరుమల క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా ముందే టైమ్‌ స్లాట్‌ తీసుకోవడం ద్వారా దర్శనం పూర్తి చేసుకోవచ్చని చెప్పడం, టోకెన్లు లేనివారిని దర్శనానికి అనుమతించరని చెప్పడంతో పెద్ద సంఖ‌్యలో తిరుపతికి తరలి వచ్చారు.

వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలోని పది ప్రాంతాల్లో టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు జారీ చేశారు. జీవకోన జడ్పీ హైస్కూల్, తిరుపతి, 2. ఎమ్మార్‌పల్లి హైస్కూల్ తిరుపతి, 3. రామచంద్ర పుష్కరిణి, 4.రామానాయుడు హైస్కూల్, బైరాగిపల్లి, తిరుపతి, 5. ఇందిరా మైదానం, తిరుపతి, 6. శ్రీనివాసం కాంప్లెక్స్‌, తిరుపతి, 7.విష్ణు నివాసం, తిరుపతి, 8. భూదేవి కాంప్లెక్స్‌, తిరుపతితో పాటు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టైమ్‌ స్లాట్ టోకెన్లు జారీ చేశారు.

జనవరి 9వ తేదీ గురువారం ఉదయం 5గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేస్తారని ప్రకటించినా 8వ తేదీ రాత్రి నుంచి టోకెన్లు విడుదల చేశారు. తొలి రోజు 10,11,12 తేదీలకు సంబంధించిన టోకెన్లు గురువారం ఉదయానికి పూర్తయ్యాయి.

13నుంచి మళ్లీ జారీ…

13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దర్శనాల టోకెన్లను శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో మాత్రమే జారీ చేస్తారు. శ్రీవారి మెట్టు కౌంటర్లను 19వ తేదీ వరకు మూసేస్తారు.

వైకుంఠ ద్వార దర్శనం జరిగే పదిరోజుల పాటు తిరుమలలో ఎలాంటి సిఫార్సు లేఖలను అనుమతించరు. భక్తులు టోకెన్లు జారీ చేసిన తర్వాత తమకు కేటాయించిన సమయాన్ని బట్టి తిరుమల పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమలలో పరిమిత సంఖ్యలో గదులు ఉన్నందున రద్దీకి తగ్గట్టుగా తిరుమల చేరుకునేలా జాగ్రత్త వహించాలని సూచించారు.

Whats_app_banner