Disha SOS: మహిళలకు అండగా దిశా యాప్… వేర్వేరు ఘటనల్లో క్విక్ రియాక్షన్-disha mobile app to support women in distress police helped two in different incidents ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Disha Mobile App To Support Women In Distress, Police Helped Two In Different Incidents

Disha SOS: మహిళలకు అండగా దిశా యాప్… వేర్వేరు ఘటనల్లో క్విక్ రియాక్షన్

HT Telugu Desk HT Telugu
May 30, 2023 01:04 PM IST

Disha SOS: రైలు ప్రయాణంలో ఉన్న యువతిని ఓ పోకిరి వేధించాడు, మరో ఘటనలో లోన్‌ యాప్‌లో అప్పు తీసుకోకపోయినా డబ్బు కట్టాలని వేధింపులు మొదలయ్యాయి. రెండు ఘటనల్లో బాధిత మహిళలు దిశ యాప్‌ను ఆశ్రయించడంతో పోలీసులు వారి ఆట కట్టించారు.

రైలు ప్రయాణంలో యువతిని వేధించిన రామరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు
రైలు ప్రయాణంలో యువతిని వేధించిన రామరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Disha SOS: అత్యవసర పరిస్థితుల్లో లోన్ యాప్ ద్వారా నగదు తీసుకోవాలని భావించిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్‌లో కనిపించిన రూపీ పే యాప్ ను డౌన్లోడ్ చేసింది. నిర్వాహకుల నుంచి ఒక్క రుపాయి అప్పు తీసుకోకపోయినా వారు ఆ మహిళకు నరకం చూపించడం మొదలుపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

అకౌంట్ లో డబ్బులు వేయకుండానే డబ్బు కట్టాలని మహిళను వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే కనకదుర్గ అనే మహిళ నగదు అవసరమై రూపీ పే యాప్ ను డౌన్లోడ్ చేసింది. ఆన్ లైన్ లోన్ యాప్ లో తన ఆధార్ కార్డ్, పాన్ కార్డు లను అప్లోడ్ చేసింది. రూపీ పే యాప్ నుండి నగదు వస్తుందనుకంటే వేధింపులు మొదలయ్యాయి.

లోన్ యాప్ నుండి తనకు ఎలాంటి డబ్బులు రాలేదని కనకదుర్గ చెప్పినా నిర్వాహకులు పట్టించుకోలేదు. నెలాఖరుకు డబ్బులు కట్టకపోతే పరువు తీస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు దిశ SOS కు కాల్ చేసి సమాచారం ఇచ్చింది.

రూపీ పే యాప్ లో ఎలాంటి రుణం తీసుకోపోయినా తనను వేధింపులకు గురిచేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కనకదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన వివరాల మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. లోన్ యాప్ మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని దిశ పోలీసులు సూచించారు.

రైలు ప్రయాణంలో యువతికి వేధింపులు….

రైల్లో ప్రయాణిస్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మైసూరు వెళుతున్న యువతిని అదే కోచ్‌లో ప్రయాణించిన యువకుడు అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అతని చేష్టలతో విసిగిపోయిన యువతి దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. బెంగుళూరుకు చెందిన యువతి ఫిర్యాదుతో అనంతపురం పోలీసులు అలెర్ట్ అయ్యారు.

కాచిగూడ నుండి మైసూర్ వెళ్తున్న ట్రైన్ ధర్మవరం చేరుకునే సరికి బాధితురాలిని గుర్తించారు. అపరిచిత వ్యక్తి తనను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పడంతో తమిళనాడు కు చెందిన రామరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు క్షేమంగా మైసూర్ వెళ్లేంత వరకు దిశ టీం పర్యవేక్షించింది. దిశ SOS కు కాల్ చేసిన వెంటనే స్పందించిన పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు చెప్పింది.

IPL_Entry_Point