CPM On APERC: ఏపీలో మరోసారి చార్జీల పెంపుకు డిస్కంలు రెడీ.. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై సీపీఎం అభ్యంతరం-discoms in ap are ready to hike tariffs once again cpm objects to proposals to increase electricity tariffs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cpm On Aperc: ఏపీలో మరోసారి చార్జీల పెంపుకు డిస్కంలు రెడీ.. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై సీపీఎం అభ్యంతరం

CPM On APERC: ఏపీలో మరోసారి చార్జీల పెంపుకు డిస్కంలు రెడీ.. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై సీపీఎం అభ్యంతరం

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 07, 2025 05:00 AM IST

CPM On APERC: విద్యుత్‌ ఛార్జీల పెంపుదల లేదంటూనే ప్రజలపై సర్దుబాటు చార్జీలపై పేరుతో భారం మోపుతోందని సీపీఎం ఆరోపించింది. విద్యుత్‌ చార్జీల పెంపుదల కోసం ఏపీ ప్రభుత్వం, పంపిణీ సంస్థలు, విద్యుత్‌ నియంత్రణ మండలి సిద్ధం అవుతుండటంపై అభ్యంతరం తెలిపింది.

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపుకు సిద్ధమవుతున్న పంపిణీ సంస్థలు
ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపుకు సిద్ధమవుతున్న పంపిణీ సంస్థలు

CPM On APERC: 2025-26 సంవత్సరాలకు సంబంధించి ఎఆర్‌ఆర్‌, టారిఫ్‌ ప్రతిపాదనలపై పంపిణీ సంస్థలు విద్యుత్‌ నియంత్రణ మండలి ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేశాయి. వీటిపై అభ్యంతరాలను మంగళవారం నుంచి స్వీకరిస్తున్నారు. ఈ నెల 7,8,10 తేదీలలో బహిరంగ విచారణ జరుపుతున్నారు. దీంతో విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రతిపాదనలపై సీపీఎం అభ్యంతరం తెలిపింది.

yearly horoscope entry point

విద్యుత్ ఛార్జీలపై సీపీఎం అభ్యంతరాలు ఇవే…

  • రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్ల నిలిపివేయాలి, ఒప్పందాలను రద్దు చేయాలి.
  • వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి ప్రభుత్వం, పంపిణీ సంస్థల ప్రతిపాదనలను ఆమోదించడం, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోపోవడాన్ని తప్పు పడుపట్టింది,.
  • గతంలో వేసిన భారాలు రద్దు చేయాలని, కొత్త భారాలు వేయవద్దని, స్మార్ట్‌ మీటర్లు నిలిపివేయాలని, అదానీ సంస్థతో చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి.
  • విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలపై సిపిఐ(యం) తరపున డిసెంబర్‌ 21,27,28 తేదీల్లో 33 పేజీలతో కూడిన పత్రాలను వ్రాతపూర్వకంగా మండలకి తెలిపింది.
  • 2025-26 సంవత్సరంలో భారాలు లేవంటూనే సర్దుబాటు చార్జీల ద్వారా వేలాది కోట్ల రూపాయల భారం ముందుగానే మోపారు. భవిష్యత్తులో కూడా మరింతగా మోపటానికి సిద్ధమవుతున్నారని సీపీఎం ఆరోపించింది.
  • 2024 -25 సంవత్సరంలో సంస్థల ప్రతిపాదనలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అనుభవం తెలుపుతున్నది. ప్రైవేట్‌ కంపెనీలకు మేలు చేసే విధంగా ప్రైవేట్‌ సంస్థల నుండి విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనాలు రూపొందిస్తున్నారు.
  • ప్రభుత్వం చెల్లించవలసిన సబ్సిడీలను కుదించి చూపి భవిష్యత్తులో సర్దుబాటు చార్జీలపై భారం మోపటానికి వాస్తవ విరుద్ధ ప్రతిపాదనలు ప్రజల ముందు ఉంచుతున్నారని సీపీఎం ఆరోపించంది.
  • రెన్యువబుల్‌ ఎనర్జీ పేరుతో అధిక రేట్లతో అవసరానికి మించి విద్యుత్‌ కొనుగోలు చేయటం వల్ల వేలాది కోట్ల రూపాయల భారం పడుతోంది. అధిక రేట్లకు ప్రైవేటు విద్యుత్‌ సంస్థలతో చేసుకున్న దీర్ఘకాలిక పీపీఏలు హాని చేస్తున్నాయి.
  • కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగి గతంలోని రాష్ట్ర ప్రభుత్వం సెకి ద్వారా అదాని సంస్థల నుండి సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు చేసే దీర్ఘకాలిక ఒప్పందం చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించింది.
  • గత ప్రభుత్వంలోని పెద్దలకు 1750 కోట్ల రూపాయల మడుపులు ఇచ్చి, అధిక రేట్లకు 25 సంవత్సరాలు సోలార్‌ విద్యుత్‌ సరఫరా చేసే ఒప్పందాలు అక్రమమని, అవినీతిమయమని అమెరికా కోర్టులలో సాక్షాధారాలతో కేసులు నమోదైనా వాటిని రద్దు చేయకపోవడాన్ని తప్పు పట్టింది.

Whats_app_banner