RGV On TDP : చంద్రబాబు అరెస్టును కేర్ చేయని జూ.ఎన్టీఆర్, ఇక టీడీపీకి దబిడి దిబిడే - ఆర్జీవీ సెటైర్లు
RGV On TDP : చంద్రబాబు అరెస్టును జూ.ఎన్టీఆర్ లైట్ తీసుకున్నారని ఆర్జీవీ సెటైర్లు వేశారు. టీడీపీ పరిస్థితి ఇక దబిడి దిబిడే అంటూ ట్వీట్ చేశారు.
RGV On TDP : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై వైసీపీ సానుభూతిపరుడు, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై జూ.ఎన్టీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ విషయంపై ఆర్జీవీ ఉపయోగించుకుని చంద్రబాబుపై సెటైర్లు వేశారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ... ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన లక్ష్యంగా సినిమాలు, ట్వీట్లు చేస్తున్నారు. ఘటన ఏదైనా సరే ట్విట్లర్లో ఎంట్రీ ఇచ్చి టీడీపీ, జనసేనపై సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్టు, పవన్ ను పోలీసులు అడ్డుకోవడంపై విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై జూ.ఎన్టీఆర్ స్పందించకపోవడం చూస్తుంటే... టీడీపీ భవిష్యత్తు దబిడి దిబిడే అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ పై టీడీపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే... ఈ వివాదంపై జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆచీతూచి స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబంతో పాటు, నిర్మాతలు అశ్వినీదత్, నట్టికుమార్, కె.రాఘవేంద్రరావు స్పందించారు. అయితే ఈ ఘటనపై జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్పందించకపోవడం గమనార్హం.
ట్రెండింగ్ వార్తలు
దోచుకోడానికే స్కిల్ డెవలప్మెంట్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు సబబేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు జైలులో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ వాళ్లు ప్రవర్తిస్తున్నారన్నారు. టీడీపీ దబాయింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. స్కిల్ స్కామ్ లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కుట్రలతో కూడిన యజ్ఞంలా ఆర్థిక అక్రమాలకు చేశారని ఆరోపించారు. దోచుకోడానికే స్కిల్ డెవలప్మెంట్ పెట్టారని విమర్శించారు. షెల్ కంపెనీల సృష్టించి కోట్లు కొట్టేశారని ఆరోపించారు. జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఆర్థిక అక్రమాలను రిపోర్టు చేశాయన్నారు. పక్కా ఆధారాలతో సీఐడీ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిందని, అందుకే కోర్టు రిమాండ్ విధించిందన్నారు.
చంద్రబాబు చట్టాలకు అతీతుడా?
చంద్రబాబు జైలులో హింసిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు జైల్లో ఉండడమే తప్పైనట్లు టీడీపీ మాట్లాడుతోందన్నారు. హౌజ్ రిమాండ్ లో ఉంటే దానిని అరెస్ట్ అంటారా? అని ప్రశ్నించారు. ఇంట్లో ఉంచేదానికి సీఐడీ అరెస్ట్ ఎందుకన్నారు. దొంగల్ని పట్టుకుంటే ఎందుకంత హడావుడి చేస్తున్నారన్నారు. టీడీపీ, ఎల్లో మీడియా తెగ హడావుడి చేస్తున్నాయన్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు అయిపోతాయా? అని ప్రశ్నించారు. చట్టాలకు చంద్రబాబు అతీతుడా? అని సజ్జల నిలదీశారు.