AP Doctors Recruitment: ఏపీలో స్పెషలిస్ట్ డాక్టర్స్‌ నియామకాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూలు-direct interviews for specialist doctors recruitment in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Doctors Recruitment: ఏపీలో స్పెషలిస్ట్ డాక్టర్స్‌ నియామకాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూలు

AP Doctors Recruitment: ఏపీలో స్పెషలిస్ట్ డాక్టర్స్‌ నియామకాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూలు

HT Telugu Desk HT Telugu
Sep 11, 2023 09:05 AM IST

AP Doctors Recruitment: ఆంధ్ర ప్రదేశ్‌లో స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి నేటి నుంచి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ల నియామకం
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ల నియామకం

AP Doctors Recruitment: ఆంధ్ర ప్రదేశ్‌లో స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి నేటి నుంచి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆస్పత్రులతోపాటు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలోఉణ్న 13 స్పెషాలిటీల్లో 343 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

ఇందుకోసం ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ సోమవారం నుంచి 15వ తేదీ వరకు వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ లను నిర్వహించనుంది. ఎన్టీఆర్‌ జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కార్యాలయంలో రోజు నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నారు. రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌లో లిమిటెడ్, జనరల్‌ పద్ధతుల్లో నియామకాలతో పాటు కాంట్రాక్ట్‌ పద్ధతిలో కూడా వైద్యులను నియమించనున్నారు.

సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో గిరిజన ప్రాంతాలను ఎంపిక చేసుకున్న వైద్యులకు నెలకు రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.రెండు లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఖరారు చేశారు. ఎన్‌హెచ్‌ఎం కింద బోధన, జిల్లా ఆస్పత్రుల్లో నియమించే వారికి రూ.1.10 లక్షలు చొప్పున ఇస్తారు. నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టు కింద డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌లలో వైద్యులుగా నియమించేవారికి మైదాన ప్రాంతాల్లో రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు చొప్పున వేతనాలు చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు అదనపు వివరాల కోసం https://hmfw.ap.gov.in/ వెబ్‌సైట్‌ను, 6301138782 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య ఆరోగ్య శాఖలో నాలుగేళ్లలో 53వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు చెబుతున్నారు. వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది.

ఇంటర్వ్యూ ల షెడ్యూల్‌ ఇలా..

సోమవారం(సెప్టెంబర్ 11వ తేదీ): జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, జనరల్‌ ఫిజిషియన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

బుధవారం(13వ తేదీ): గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ, పెథాలజీ ఇంటర్వ్యూలు ఉంటాయి.

శుక్రవారం(15వ తేదీ): పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్‌ డిసీజెస్‌ విభాగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.