AP APAAR Cards : అపార్‌ కార్డుల జారీకి అడ్డంకులు.. ఇలా చేస్తే ఉండవు ఏ ఇబ్బందులు!-difficulties in issuing aapar cards to students in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Apaar Cards : అపార్‌ కార్డుల జారీకి అడ్డంకులు.. ఇలా చేస్తే ఉండవు ఏ ఇబ్బందులు!

AP APAAR Cards : అపార్‌ కార్డుల జారీకి అడ్డంకులు.. ఇలా చేస్తే ఉండవు ఏ ఇబ్బందులు!

Basani Shiva Kumar HT Telugu
Oct 27, 2024 11:30 AM IST

AP APAAR Cards : నూతన విద్యా విధానంలో భాగంగా.. ప్రతీ విద్యార్థికి జీవితకాల గుర్తింపు సంఖ్యతో కార్డు జారీ చేయాలని కేంద్రం ఆదేశించింది. విద్యార్థుల అకడమిక్‌ పురోగతిని ట్రాక్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని భావించింది. కానీ.. వివిధ కారణాలతో ఆపార్ కార్డుల జారీకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

అపార్‌ కార్డు
అపార్‌ కార్డు

రాష్ట్రంలోని విద్యార్థులకు అపార్‌ కార్డుల జారీ ప్రక్రియకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించడం లేదు. కానీ.. కార్డులు జారీ చేయాలని పాఠాశాలల ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి పెంచుతున్నారు. కార్డులు జారీ చేయనివారికి మెమోలు ఇస్తామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో హెచ్‌ఎంలు అవస్థలు పడుతున్నారు.

తొలుత 9, 10 తరగతుల్లో ఉన్న విద్యార్థులకు కార్డుల జారీ ప్రారంభించారు. ప్రతీ విద్యార్థికి ఇప్పటికే యూడైస్‌ నంబరు కేటాయించారు. అయితే.. చాలామంది విద్యార్థుల సమాచారం పాఠశాలల రికార్డుల్లో ఒకలా.. ఆధార్‌ కార్డుల్లో మరోలా ఉన్నాయి. 15 శాతంలోపు మాత్రమే వివరాలు మ్యాచ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆధార్‌ నమోదులోనే ఎక్కువ తప్పిదాలున్నాయని చెబుతున్నారు.

ఇలా చేస్తే బెటర్..

పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లను అడ్మిషన్‌ రిజిస్టర్‌ ప్రకారం.. పాఠశాల హెచ్‌ఎం యూడైస్‌లో మార్చొచ్చు. విద్యార్థి పేరును మాత్రం ఎమ్మార్సీవారు మార్చాలి. ఆధార్‌లోని వివరాలు ఆధార్‌ సెంటర్‌లోనే మార్చాలి. స్కూల్‌ అడ్మిషన్‌ రిజిస్టర్‌ ప్రకారం హెచ్‌ఎం సర్టిఫికెట్‌ ఇస్తే.. ఈ వివరాల ప్రకారం ఆధార్‌ కేంద్రాల్లో మార్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. అప్పుడు ప్రక్రియ సులభతరం అవుతుంది. ఆధార్‌ వివరాల సవరణ బాధ్యత హెచ్‌ఎంలకు అప్పగించినా.. ఆపార్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

అసలు అపార్‌ అంటే ఏంటీ..

ఆపార్ అంటే.. ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ. 12 అంకెలతో ఈ కార్డును జారీ చేస్తారు. స్కూల్‌ రికార్డులోని విద్యార్థి వ్యక్తిగత సమాచారం యథాతధంగా ఆధార్‌ కార్డులో ఉంటేనే అపార్‌ జారీ అవుతుంది. జాతీయ స్థాయిలో ఒక విద్యార్థి ఏ పాఠశాలలో ఉన్నాడో.. ఈ నంబరు ద్వారా ట్రాక్ చేయొచ్చు. స్టూడెంట్ మరో స్కూలుకు వెళ్లినా.. వారి స్కూల్‌ రికార్డు ఆన్‌లైన్‌లో మారుతుంటుంది. అందుకే ఆపార్‌ను తీసుకొచ్చారు.

Whats_app_banner