AP Weather Updates: నైరుతి వచ్చినా మండుతున్న ఎండలు.. ఏపీలో తగ్గని ఉష్ణోగ్రతలు-despite the entry of southwest monsoon the temperature will not decrease in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Despite The Entry Of Southwest Monsoon, The Temperature Will Not Decrease In Ap

AP Weather Updates: నైరుతి వచ్చినా మండుతున్న ఎండలు.. ఏపీలో తగ్గని ఉష్ణోగ్రతలు

HT Telugu Desk HT Telugu
Jun 13, 2023 08:04 AM IST

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండ వేడి మాత్రం తగ్గలేదు. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 44డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 మండుతున్న ఎండలు
మండుతున్న ఎండలు

AP Weather Updates: ఏపీలో ఎండలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టినా ఉష్ణోగ్రతల్లో మాత్రం మార్పు లేదు. అన్నిప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. రుతు పవనాలు కేరళను తాకిన తర్వాత ఏపీకి రావడానికి సాధారణంగా నాలుగు రోజుల సమయం పడుతుంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఈ నెల 8వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. 12వ తేదీ నాటికి ఏపీకి వస్తాయని భావించారు. మరోవైపు బిపర్‌జోయ్‌ తుపాను కారణంగా రుతు పవనాలు చురుగ్గా కదలడంతో ఒకరోజు ముందుగానే ఏపీలో ప్రవేశించాయి.

ఆదివారం తిరుపతి జిల్లా శ్రీహరికోట మీదుగా ఏపీలోకి ప్రవేశించాయి. వచ్చే 48 గంటల్లో రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు, కోస్తాలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజుల్లో మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. రుతు పవనాల ప్రభావంతో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. మరో వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత, వడగాలులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. మంగళవారం 43 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 266 మండలాల్లో వడగాల్పులు, బుధవారం 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 294 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

సోమవారం మన్యం జిల్లా సాలూరులో 44.9°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.8°C, తిరుపతి జిల్లా పెద్ద కన్నాలిలో 44.5°C, ప్రకాశం జిల్లా దొనకొండ, కాకినాడ జిల్లా కరపలో 43.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 184 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

WhatsApp channel