Dead body In Suitcase: సూట్‌కేస్‌లో డెడ్‌బాడీ, ప్లాట్‌ఫాం విసిరేసిన నిందితులు, పట్టుకున్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్-dead body in suitcase accused who threw platform rpf constable caught ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dead Body In Suitcase: సూట్‌కేస్‌లో డెడ్‌బాడీ, ప్లాట్‌ఫాం విసిరేసిన నిందితులు, పట్టుకున్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్

Dead body In Suitcase: సూట్‌కేస్‌లో డెడ్‌బాడీ, ప్లాట్‌ఫాం విసిరేసిన నిందితులు, పట్టుకున్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్

Dead body In Suitcase: నెల్లూరు నుంచి చెన్నై సెంట్రల్ వెళుతున్న సబర్బన్ ట్రైన్‌లో సూట్‌కేసులో శవాన్ని తరలించిన నిందితులు తమిళనాడులోని మింజూర్‌ స్టేషన్‌ ప్లాట్‌‌ఫాంపై సూట్‌కేసును విసిరేశారు. దీనిని గమనించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది అనుమానంతో నిందితుల్ని ప్రశ్నించడంతో హత్య వెలుగు చూసింది.

హత్య కేసు నిందితుల్ని విచారిస్తున్న పోలీసులు

Dead body In Suitcase: తమిళనాడులోని చెన్నైకు సమీపంలోని మింజూర్ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌‌ఫామ్‌పైకి రైల్లోంచి విసిరేసిన సూట్‌కేసులో శవం బయటపడటం కలకలం రేపింది. ఏపీలోని నెల్లూరు నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్లే ఎలక్ట్రికల్ సబర్బన్ రైల్లో తండ్రి కూతుళ్లు సూట్‌కేసులో ఉంచిన శవాన్ని మింజూర్‌ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌ పైకి విసిరేశారు. రాత్రి 8.30 గంటల సమయంలో ప్లాట్ ఫామ్‌పై విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్ రైలు కదలడానికి ముందే సూట్‌కేసు పడేయడం గమనించి వారిని అడ్డుకున్నారు.

ప్లాట్‌‌ఫామ్‌పై పడిన సూట్‌కేసు నుంచి రక్తం కారడంతో అనుమానించిన కానిస్టేబుల్ మహేష్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. రైల్వే సిబ్బంది సహకారంతో వారిని పారిపోకుండా అడ్డుకోవడంతో హత్య విషయం వెలుగు చూసింది. సూట్‌కేసును తెరిచి చూడటంతో అందులో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. నిందితులు తండ్రి కూతుళ్లుగా గుర్తించారు.

నెల్లూరులో వృద్ధురాలిని హత్య చేసి శవాన్ని పాడేసేందుకు రైల్లో తరలించినట్టు విచారణ బృందం సభ్యులు తెలిపారు. విచారణలో మృతురాలిని మన్యం రమణిగా గుర్తించారు. తన కుమార్తెను వ్యభిచారంలో దింపేందుకు రమణి ప్రయత్నించడంతో తమ మధ్య గొడవ జరిగిందని ఈ క్రమంలో ఆమెను హత్య చేసినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు.నిందితులు సమాధానాలు సందేహాస్పదంగా ఉండటంతో పోలీసులు విచారించారు. 

అయితే పోలీసుల విచారణలో నిందితులు బంగారు ఆభరణాల కోసమే రమణిని నిందితులు హత్య చేసినట్టు గుర్తించారు.  నిందితుల ఇంటికి సమీపంలో నివసించే వృద్ధురాలు సోమవారం ఉదయం కూరగాయలు కొనేందుకు వెళ్లి వస్తుండగా ఇంటికి పిలిచి ఆమెను హత్య చేశారు. హత్య తర్వాత మహిళ మృతదేహంపై ఉన్న 50గ్రాముల బంగారాన్ని అపహరించి వాటిని బంగారు కడ్డీలుగా మార్చుకున్నారు.

సోమవారం సాయంత్రం మృతదేహాన్ని సబర్బన్ రైల్లో శవాన్ని తరలించి మింజూర్ స్టేషన్‌లో పడేసే ప్రయత్నం చేశారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు కట్టుకథలు అల్లినట్టు గుర్తించారు. నిందితుడు సుబ్రహ్మణ్యం స్వస్థలం నెల్లూరుగా గుర్తించారు. శవాన్ని పడేయడానికి అనువుగా ఉంటుందని మింజూర్‌ స్టేషన్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. హత్యకు దివ్యశ్రీ పథక రచన చేసినట్టు భావిస్తున్నారు. ఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్ అప్రమత్తంగా వ్యవహరించడంతో హత్య వెలుగు చూసింది. హతురాలిని 

నవంబర్ 4వ తేదీన మన్నెం రమణి అనే మహిళ కనిపించడం లేదని ఆమె కుమారుడు పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెన్నై సమీపంలో మింజూర్ పోలీస్ స్టేషన్‌లో సూట్‌కేసులో శవం కనిపించడంతో ఆ ఫోటోలను మృతురాలి కుటుంబ సభ్యులు గుర్తించారు.  ఈ మేరకు నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదు చేశారు. మృతురాలికి ఇంటికి సమీపంలోనే  నిందితులు నివసిస్తున్నట్టు గుర్తించారు.