WG Murder Mystery: వీడిన డెడ్‌బాడీ డోర్‌ డెలివరీ మిస్టరీ.. సొంత చెల్లి, మరిదిలే అసలు నిందితులు-dead body door delivery mystery own sister other accused ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Wg Murder Mystery: వీడిన డెడ్‌బాడీ డోర్‌ డెలివరీ మిస్టరీ.. సొంత చెల్లి, మరిదిలే అసలు నిందితులు

WG Murder Mystery: వీడిన డెడ్‌బాడీ డోర్‌ డెలివరీ మిస్టరీ.. సొంత చెల్లి, మరిదిలే అసలు నిందితులు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 27, 2024 12:57 PM IST

WG Murder Mystery: ఏపీలో సంచలనం సృష్టించిన డెడ్‌ బాడీ డోర్‌ డెలివరీ మిస్టరీ వీడింది. ఉండి మండలం యండగొండిలో మహిళ ఇంటికి డెడ్‌బాడీ పార్సిల్‌ చేరడం వెనుక కుట్రను పోలీసులు చేధించారు. వదినను బెదిరించి ఆమె పేరిట ఉన్న మూడెకరాల పొలం కాజేసేందుకు బాధితురాలి చెల్లెలు, మరిది పన్నిన కుట్రగా తేల్చారు.

వీడిప యండగొండి చెక్కపెట్టెలో శవం మిస్టరీ, నిందితుల అరెస్ట్‌
వీడిప యండగొండి చెక్కపెట్టెలో శవం మిస్టరీ, నిందితుల అరెస్ట్‌

WG Murder Mystery: ఉండిలో డెడ్‌బాడీ డోర్‌ డెలివరీని కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్‌ వర్మ అలియాస్‌ సుధీర్‌ వర్మతో పాటు అతని రెండో భార్య రేవతి మూడో భార్య సుష్మలను అరెస్ట్‌ చేశారు. రేవతి అక్క తులసి పేరిట ఉన్న ఆస్తి కోసం అమాయకుడిని హత్య చేసి ఆ శవాన్ని మహిళ ఇంటికి పార్సిల్‌ పంపి ఆపై బెదిరింపులకు పాల్పడినట్టు గుర్తించారు. నిందితుల వివరాలను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు.

yearly horoscope entry point

ఉండి మండలం యండగండి గ్రామంలో ముదునూరి రంగరాజు నివాసానికి చెక్క పెట్టెలో మృతదేహం డెలివరీ చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత వదినను బెదిరించి భయపెట్టడానికి గ్రామానికి చెందిన పర్లయ్యను హత్య చేసి చెక్కపెట్టెలో డెలివరీ చేసినట్టు నిందితులు అంగీకరించారు. నిందితుడి రెండో భార్య రేవతి అక్క పేరుతో ఉన్న మూడెకరాల పొలం కోసమే ఈ డ్రామా నడిచినట్టు జిల్లా పోలీసులుప్రకటించారు.

గ్రామానికి చెందిన పర్లయ్యను ప్రధాన నిందితుడు తిరుమాని శ్రీధర్ వర్మ హత్య చేసి చెక్కపెట్టెలో తన మూడో భార్య సాయంతో ఆటోలో తులసి ఇంటికి పంపినట్టు గుర్తించారు.శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి అక్క సాగి తులసి పేరిట ఉన్న మూడెకరాల పొలాన్ని కాజేయడానికి ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించారు.

చెక్క పెట్టెలో శవాన్ని పంపి హత్య కేసులో ఇరుక్కుంటావని బెదిరించి ఆమెను బెదిరించే ప్రయత్నం బెడిసికొట్టింది. నిందితుడు శ్రీధర్‌వర్మ కూలీ పనికోసం వచ్చిన కాళ్ల గ్రామానికి చెందిన గాంధీనగరం వాసి బర్రె పర్లయ్యను నిందితుడు శ్రీధర్‌ వర్మ గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. కాళ్ల మండలం కోపల్లె నుంచి ఉండి వచ్చే వాండ్రం దారిలో పర్లయ్యను నిందితుడు హత్య చేశాడు.

కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామానికి చెందిన తిరుమాని శ్రీధర్ వర్మ అమ్మాయిలకు వల వేయడంలో దిట్ట. శ్రీధర్‌ వర్మకు మొదట ఎలిజబెత్ రాణితో పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్‌ మీడియాలో మహిళలను వలపన్నడంలో ఆరితేరాడు. తనది కూడా క్షత్రియ సామాజిక వర్గమేనని నమ్మించి యండగండికి చెందిన రేవతిని పదేళ్ల క్రితం ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత గణపవరం మండలానికి చెందిన సుష్మను కూడా వివాహం చేసుకున్నాడు.

ఆస్తి కోసమే హత్య…సహకరించిన భార్యలు..

రేవతి అక్క పేరుతో ఉన్న ఆస్తిని కాజేయడానికి పథకం పన్నిన శ్రీధర్‌ వర్మకు అతని ఇద్దరు భార్యలు సహకరించారు. సొంత అక్కను బెదిరించి ఆస్తిని కాజేయాలనే ప్లాన్‌కు తులసి సోదరి రేవతి సహకరించింది. తులసికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఈ ఇంటికి క్షత్రియ సేవా సంఘం నుంచి నిర్మాణ సామాగ్రిని అందిస్తున్నట్టు నమ్మించారు.

ఈ క్రమంలో శవాన్ని ఇంటికి పంపడం ద్వారా తులసిని భయపెట్టాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో శవం దొరక్క పోవడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హత్యచేసిన ఆ శవాన్ని చెక్కపెట్టెలో తులసి ఇంటికి పంపారు. మొదటి రోజు వర్షంలో కారు టైర్ పంక్చర్ కావడంతో పెట్టెను గాంధీనగరంలో ఇంట్లో ఉంచారు. మర్నాడు ఆటోలో యండగండిలోని తులసి ఇంటికి పార్సిల్ పంపారని ఉండి పోలీసులు వివరించారు.

ఆస్తి రాయించుకోడానికి ప్రయత్నించి పరారై..

ఎలక్ట్రిక్ సామానులు వచ్చాయని చెక్క పెట్టె తెరిచిన తులసికి అందులో శవం చూసి భయపడింది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న శ్రీధర్ వర్మ శవం విషయం బయటకు పొక్కకుండా తాను చూసుకుంటానని ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారు. సంతకాలు చేయకపోతే ఆమెను కూడా శవంగా మారుస్తామని బెదిరించారు. ఫోన్‌ కూడా లాగేసుకోవడంతో తులసి షాక్‌కు గురైంది. ఈ లోపు టాయ్‌లెట్‌కు వెళ్తానని చెప్పిన తులసి మరో ఫోన్‌ నుంచి గ్రామస్తులకు సమాచారం అందించింది. దీంతో తులసి ఇంటికి కొందరు చేరుకోవడంతో శ్రీధర్

యండగొండిలో శవం విషయం బయటకు పొక్కడంతో శ్రీధర్ వర్మ మూడో భార్య సుష్మ, కూతురితో కలిసి కృష్ణాజిల్లా బంటుమిల్లి మీదుగా మంగినపూడి చేరుకున్నాడు. తాళ్లపాలెంలో కారును విడిచి గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పోలీసులు ఆరా తీయడంతో గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారి గురించి పోలీసులకు సమాచారం అందింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో కేసు మిస్టరీ వీడింది. నిందితుడి బ్యాంకు ఖాతాల్లో కోట్ల నగదు ఉండటం గుర్తించిన పోలీసులు అతని వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు.

Whats_app_banner