AP TG Temperatures : జర జాగ్రత్త...! ఏపీలో మరింత పెరగనున్న ఎండ తీవ్రత
AP Telangana Temperatures : ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం దాటితే చాలు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండు మూడురోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం దాటితే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత తట్టుకోలేక… ఇళ్ల నుంచి కూడా బయటికి రావాలంటే జంకుతున్నారు.
ఫిబ్రవరి మాసం దాటకముందే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఉదయం 11 దాటితే చాలు ప్రజలు ఇబ్బందిపడిపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నాం సమయంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది.
ఏపీలో పెరగనున్న ఉష్ణోగ్రతలు….
ఏపీలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి పూర్తిగా పొడిగా ఉండనుంది.
దక్షిణ కోస్తాలో ఇవాళ పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పొడి వాతావరణం ఉండనుంది.రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
గురువారం వరకు కూడా ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా ప్రకటించిన బులెటిన్ ప్రకారం… 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎండ తీవ్రత ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. చాలాచోట్ల ఇప్పటికే 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిన పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. వేసవి నేపథ్యంలో జాగ్రతలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో చూస్తే…..
ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం