ఏపీలో మళ్లీ కోవిడ్ అలర్ట్‌.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. సభలు, సమావేశాలు, సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు-covid alert again in ap government issues guidelines restrictions on gatherings meetings mass events ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో మళ్లీ కోవిడ్ అలర్ట్‌.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. సభలు, సమావేశాలు, సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు

ఏపీలో మళ్లీ కోవిడ్ అలర్ట్‌.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. సభలు, సమావేశాలు, సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు

Sarath Chandra.B HT Telugu

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీలో కోవిడ్‌ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసింది.

కోవిడ్ ప్రోటోకాల్‌పై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు (unsplash)

దేశంలో కోవిడ్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో ముందస్తు చర్యలు చేపట్టింది.

దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఆరోగ్య శాఖ‌ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, బహిరంగ కార్యక్రమాలు వంటి అన్ని సామూహిక సమావేశాలను తక్షణం నిలిపి వేయాలని పేర్కొన్నారు.
  • రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు, విమానాశ్రయాలలో అన్ని COVID-19 ప్రవర్తన నియమావళి పాటించాలని స్పష్టం చేశారు.
  • వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు) గర్భిణీ స్త్రీలను ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలని సూచించారు.
  • మంచి పరిశుభ్రతను పాటించాలని-క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గు/తుమ్ములు వచ్చినప్పుడు నోటిని కప్పి, పదేపదే ముఖాన్ని తాకడం వంటి పనులు చేయొద్దని సూచించారు.
  • ప్రమాదకర ప్రాంతాలలో మాస్క్‌లు ధరించాలని, రద్దీ ప్రదేశాలు, తక్కువ గాలి ప్రసరణ ఉన్న ప్రదేశంలో ఉంటే, మాస్క్ ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయ పడుతుందని సూచించారు.
  • కోవిడ్‌ సంబంధిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని-COVID-19 కేసులను ముందుగానే గుర్తించడంలో నిర్దారణ పరీక్ష కీలకంగా ఉంటుందన్నారు.
  • కోవిడ్ ప్రభావిత దేశాలకు ప్రయాణించిన వ్యక్తికి పరీక్షలు చేయించుకోవాలని, సాధారణ లక్షణాలలో లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయని తేలికపాటి నుండి మితమైన లక్షణాలలో జ్వరం, చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు లేదా విరేచనాలు ఉంటాయి.
  • ఇలాంటి లక్షణాలు గమనించినట్లయితే నిర్ధారణ మరియు చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు.
  • అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండాలని ఇతరులను సంప్రదించకుండా ఉండటం ద్వారా ఇతరులను కోవిడ్ బారిన పడకుండా కాపాడొచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
  • ఆరోగ్య శాఖ ద్వారా వ్యాధి నిర్దారణ పరీక్షలతో 24/7 ల్యాబ్‌లతో మాస్క్, PPE కిట్, ట్రిపుల్ లేయర్ మాస్క్‌‌లను తగినంత పరిమాణంలో ఉంచుకోవాలని సూచించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం