రాష్ట్రంలో మళ్లీ కరోనా టెన్షన్‌.. విశాఖ, కడపలో పాజిటివ్‌ కేసులు నమోదు.. ఇవీ లక్షణాలు-corona positive cases registered in visakhapatnam and kadapa ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రాష్ట్రంలో మళ్లీ కరోనా టెన్షన్‌.. విశాఖ, కడపలో పాజిటివ్‌ కేసులు నమోదు.. ఇవీ లక్షణాలు

రాష్ట్రంలో మళ్లీ కరోనా టెన్షన్‌.. విశాఖ, కడపలో పాజిటివ్‌ కేసులు నమోదు.. ఇవీ లక్షణాలు

రాష్ట్రంలో మళ్లీ కరోనా టెన్షన్‌ మొదలైంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం, కడపలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అధికారులు అలర్ట్ అయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. మాస్కులు తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించింది.

కరోనా వైరస్ (unsplash)

మళ్లీ కరోనా టెన్షన్‌ స్టార్ట్ అయ్యింది. విశాఖపట్నం, కడపలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ లక్షణాలు కనిపిస్తే..

రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని.. అధికారులు స్పష్టం చేశారు. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆరోగ్య శాఖకు చెందిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌ల్లో మాస్కులు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

టీకాలు వేయించుకోవాలి..

టీకాలు వేయించుకోవడం మంచిది అని అధికారులు సూచిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా, ఒకవేళ వచ్చినా తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం లేదా మరణించడం వంటి ప్రమాదాలను టీకాలు తగ్గిస్తాయి. ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో చేతులను తరచుగా కడగాలి. సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే, కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

ఈ జాగ్రత్తలు పాటించండి..

రద్దీగా ఉండే ప్రదేశాల్లో లేదా గాలి బాగా లేని ప్రదేశాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ముక్కు, నోరు పూర్తిగా కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇతరుల నుండి కనీసం 1 మీటరు (3 అడుగులు) దూరం పాటించాలి. ముఖ్యంగా దగ్గు లేదా జలుబు వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. కళ్లను, ముక్కును, నోటిని తాకడం మానుకోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును టిష్యూ లేదా మోచేతితో కప్పుకోవాలి. ఉపయోగించిన టిష్యూను వెంటనే డస్ట్‌బిన్‌లో వేసి.. చేతులను కడుక్కోవాలి. సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి.

సంబంధిత కథనం