RGV Bail Petition : ఒంగోలు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి- హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ-controversial director rgv filed bail petition in ap high court on ongole case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rgv Bail Petition : ఒంగోలు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి- హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ

RGV Bail Petition : ఒంగోలు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి- హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ

Bandaru Satyaprasad HT Telugu
Nov 20, 2024 12:45 PM IST

RGV Bail Petition : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. ఒంగోలులో నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఒంగోలు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి- హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ
ఒంగోలు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి- హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఏపీలో ఆర్జీవీపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీకి చుక్కెదురైంది. దీంతో మరో ప్రయత్నంగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ప్రకాశం జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్జీవీ అనేక వివాదాస్పద సినిమాలు తీశారు. వైసీపీకి మద్దతుగా... చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీశారు. దీంతో పాటు సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. వైసీపీ అధినేత జగన్ పై తీసిన వ్యూహం సినిమా విడుదల సందర్భంగా చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్జీవీకి నోటిసులు ఇచ్చారు. ఈ నెల 19న విచారణకు హాజరవ్వాలని తెలిపారు.

అయితే ఆర్జీవీ విచారణకు హాజరవ్వలేదు. బిజీ షూటింగ్ కారణంగా విచారణకు హాజరు రాలేనని వాట్సాప్ లో పోలీసులు మెసేజ్ చేశారు. పోలీసుల నుంచి సమాధానం రాకపోయే సరి...తన లాయర్ ను పోలీస్ స్టేషన్ కు పంపి సినిమా షూటింగ్‌ కారణంగా ఆర్జీవీ విచారణకు హాజరుకాలేకపోయారని చెప్పించారు. విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. పోలీస్ విచారణను హాజరు కానీ వర్మ... ఇప్పుడు హైకోర్టులో ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

ఐటీ చట్టం ప్రకారం ఆర్జీవీపై కేసు

సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా వర్మ పోస్టులు, వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన రామలింగం ఫిర్యాదు మేరకు నవంబర్ 12, 2024వ తేదీన ఈ కేసు నమోదైంది. ‘వ్యూహం’ చిత్రం ప్రచార కార్యక్రమాలలో రాజకీయ ప్రముఖులను కించపరిచేలా వర్మ చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు.. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఇంటికి వచ్చి అందజేశారు. నవంబర్ 19న ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీసుకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు.. BNS చట్టంలోని 336 (4), 353 (2) సెక్షన్ల కింద ఆర్జీవీపై కేసు నమోదు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ధృవీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్జీవీ డెన్‌ కార్యాలయంలో వర్మకు నోటీసులు అందించినట్లు తెలిపారు.

వైసీపీ ప్రభుత్వ సమయంలో ఆర్జీవీ...కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ విరుచుకుపడేవారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం ఆధారంగా తీసిన 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేశ్‌, బ్రాహ్మణిపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేత రామలింగం ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Whats_app_banner

సంబంధిత కథనం