Murder Plan : కానిస్టేబుల్ హత్యకు భార్య ప్లాన్… భగ్నం చేసిన పోలీసులు-constables murder conspiracy hatched by the satyasai district puttaparti police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Constable's Murder Conspiracy Hatched By The Satyasai District Puttaparti Police

Murder Plan : కానిస్టేబుల్ హత్యకు భార్య ప్లాన్… భగ్నం చేసిన పోలీసులు

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 12:21 PM IST

Murder Plan వరుస వివాదాలు, ఆర్ధిక ఇబ్బందలు, అక్రమ సంబంధం నేపథ్యంలో కానిస్టేబుల్ హత్యకు భార్య చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వంకరకుంటలో సంచలనం రేకెత్తించిన గుప్త నిధుల తవ్వకాల కేసు దర్యాప్తులో భర్త హత్యకు భార్య పన్నిన కుట్రను కూడా చేధించారు.

కానిస్టేబుల్ హత్యకు పన్నిన కుట్రను చేధించిన పోలీసులు
కానిస్టేబుల్ హత్యకు పన్నిన కుట్రను చేధించిన పోలీసులు (HT_PRINT)

Murder Plan ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విధుల నుంచి డిస్మిస్ అయిన భర్తను హత్య చేయించేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. గుప్తనిధుల కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను విచారిస్తున్న క్రమంలో హత్య కుట్ర వెలుగు చూసింది. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన తొమ్మిది మంది అరెస్ట్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

నల్లమాడ పోలీసు సర్కిల్‌ పరిధిలోని వంకరకుంట గ్రామానికి చెందిన రైతు వెంకటాద్రి పొలంలో గుప్త నిధుల కోసం ఈ నెల 14న గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై రైతు వెంకటాద్రి ఫిర్యాదు చేయడంతో నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ యశ్వంత్‌ పర్యవేక్షణలో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి లోతైన దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది.

గుప్త నిధుల తవ్వకాల కేసులో పట్టుబడిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన నిజాముద్దీన్, నల్లమాడ మండలం చెరువు వాండ్లపల్లికి చెందిన శివశంకరరెడ్డి, నరేంద్ర రెడ్డి, హైదరాబాద్‌ నివాసి శ్రీనివాసులు, పుట్టపర్తికి చెందిన విజయ్, తమిళనాడుకు చెందిన చాంద్‌బాషా, మురుగన్, సురేష్‌, అనంతపురానికి చెందిన ఏఆర్‌ మాజీ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ భార్య నాగమణి ఉన్నారు. వీరి నుంచి గుప్త నిధుల తవ్వకానికి వినియోగించిన ఇనుపరాడ్లు, బండలను తొలగించేందుకు ఉపయోగించే 20/30 పౌడర్, పూజకు వినియోగించిన ముడుపు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు.

గుప్త నిధుల కేసుతో హత్య కుట్ర వెలుగులోకి….

గుప్త నిధుల కేసులో నిందితుల అరెస్టుతో అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్‌ మాజీ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది. ప్రకాష్‌, నాగమణి దంపతుల మధ్య కొన్నాళ్లుగా వివాదాలు జరుగుతున్నాయి.

ప్రకాష్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని భార్యను నిర్లక్ష్యం చేయడంతో పాటు వేధింపులకు గురి చేస్తుండడంతో ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్‌తో కలిసి భర్త హత్యకు నాగమణి పథకం రచించింది. భర్తను వదిలించుకోడానికి క్షుద్రపూజలు చేయించాలని భావించింది. ఇందుకు సహకరిస్తానని నిజాముద్దీన్ హామీ ఇచ్చాడు.

మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ప్రకాష్‌ను పోలీసులు విధుల నుంచి తొలగించారు. దీంతో కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. ప్రకాష్‌ను హత్య చేయడానికి నిజాముద్దీన్‌, నాగమణి మధ్య మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్‌లను పోలీసులు గుర్తించడంతో హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది.

IPL_Entry_Point

టాపిక్