Edible Oil Factory : కంపెనీ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం….-company negligence caused accident in kakinada district peddapuram edible oil factory deaths ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Company Negligence Caused Accident In Kakinada District Peddapuram Edible Oil Factory Deaths

Edible Oil Factory : కంపెనీ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం….

HT Telugu Desk HT Telugu
Feb 13, 2023 09:02 AM IST

Edible Oil Factory కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఏడుగురు కార్మికులు చనిపోవడానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని కమిటీ నివేదిక తేల్చింది. పెద్దాపురంలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో నూనె ట్యాంకులు శుభ్రం చేయడానికి దిగిన ఏడుగురు కార్మికులు చనిపోవడానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని నివేదికలో తేల్చారు.

ప్రమాదానికి కారణమైన ఆ‍యిల్ ట్యాంకర్లు
ప్రమాదానికి కారణమైన ఆ‍యిల్ ట్యాంకర్లు

Edible Oil Factory కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఏడుగురు కార్మికులు చనిపోవడానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని తేలింది. పెద్దాపురంలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ 13పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనుభవం లేని కార్మికుల్ని వంట నూనెల ట్యాంకుల్ని శుభ్రం చేయడానికి వినియోగించడంతోనే ప్రమాదం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.

Oil Factory Accident కాకినాడ జిల్లా జి.రాగంపేటలో ఈ నెల 9న ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న కర్మాగారంలో ఆయిల్ ట్యాంకర్లను శుభ్రం చేస్తూ ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు బాధిత కుటుంబాలు ఆరోపించాయి. కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం బాధ్యులపై కేసులు నమోదు చేసింది.

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట మండలంలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. ఆయిల్ ట్యాంకర్‌ శుభ్రం చేయడానికి లోపలకు దిగిన కార్మికులు ఒక్కొక్కరుగా లోపలకు దిగి మృతి చెందారు. నూనెలో జారిపోయిన కార్మికులు ఆ ద్రవాన్ని తాగేయడంతో చనిపోయారు. .

గత గురువారం ఉదయం ఆరుగంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్లు శుభ్రం చేయడానికి కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణకు వచ్చారు. పని ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. పాడేరుకు చెందిన సాగర్ అనే వ్యక్తి ఆయిల్ ట్యాంకర్‌ శుభ్రం చేస్తుండగా ఊపిరి అందకపోవడంతో లోపలకు జారిపోయాడు. అతడిని రక్షించేందుకు వచ్చిన వారు కూడా అపస్మారక స్థితిలోకి చేరడంతో మిగిలిన వారు వారిని రక్షించేందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయారు.

మృతులను రామారావు, ప్రసాద్ జగదీష్, వెచ్చంగి సాగర్, బొంజుబాబు, వెచ్చింగి కృష్ణ, వెచ్చంగి నరసింహలుగా గుర్తించారు.మృతుల్లో ఐదుగురిది పాడేరుగా గుర్తించారు. మరో ఇద్దరు మృతులను పెద్దాపురం మండలం పులిమేరుగా వాసులుగా గుర్తించారు.

కంపెనీ యాజమాన్యం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. భారీ పరిణామంలో ఉన్న వంట నూనెల ట్యాంకర్లను శుభ్రం చేసే పనుల్ని పాడేరు, పులిమేరులకు చెందిన వారికి అప్పగించారు. ట్యాంకర్లలో ఆక్సిజన్ పరిణామాన్ని గుర్తించకుండా కార్మికుండా కార్మికుల్ని పనిలోకి పురమాయించడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాలతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.
తాజాగా ప్రభుత్వానికి కమిటీ సమర్పించిన నివేదికలో సైతం కంపెనీ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు వెల్లడైంది. అనుభవం లేని కార్మికుల్ని నూనె ట్యాంకర్లలోకి దింపడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలాకియా నేతృత్వంలోని కమిటీ ప్రమాదం జరిగిన రోజు ఘటనకు దారి తీసిన పరిణామాలను పరిశీలించి నివేదిక రూపొందించారు. కిరణ్, సాగర్ అనే కార్మికులు మొదట ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు.

ట్యాంకులో ఉన్న స్టీలు నిచ్చెన ద్వారా పైకి రావడానికి ప్రయత్నించినా పట్టు తప్పి మడ్డిలోకి జారిపోయారు. అతడిని కాపాడే క్రమంలో ఒకరి తర్వాత మరొకరు వరుసగా ప్రమాదానికి గురయ్యారని వివరించారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన సింగవరపు విశ్వనాథ్‌, సింగవరపు రఘురాంతో పాటు ఫ్యాక్టరీ సూపర్ వైజర్ అక్కిరెడ్డి శ్రీనివాస్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు.

WhatsApp channel