CM Jagan in Assembly: అసెంబ్లీ వేదికగా తానంటే ఏంటో చెప్పిన సీఎం జగన్-cm ys jagan satiers on tdp in ap assembly sessions 2023
Telugu News  /  Andhra Pradesh  /  Cm Ys Jagan Satiers On Tdp In Ap Assembly Sessions 2023
అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్
అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ (twitter)

CM Jagan in Assembly: అసెంబ్లీ వేదికగా తానంటే ఏంటో చెప్పిన సీఎం జగన్

15 March 2023, 19:53 ISTHT Telugu Desk
15 March 2023, 19:53 IST

AP Assembly Latest Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా టీడీపీని టార్గెట్ చేశారు సీఎం జగన్. గత ప్రభుత్వం గాల్లో నడిస్తే.. తాను మాత్రం నేలపైనే నడుస్తున్నానంటూ టీడీపీపై సెటైర్లు విసిరారు. తన లక్ష్యం పేదరిక నిర్మూలనే అని చెప్పారు.

AP Assembly Budegt Sessions 2023: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం సమావేశాలు ప్రారంభంకాగా... ఇవాళ టీడీపీ, వైసీపీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. గవర్నర్ కు అనుమానం అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ సీరియస్ కావటమే కాదు... 12 మందిని సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే... రెండోరోజు సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాన్ని చెబుతూనే... ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించారు.

తన లక్ష్యం పేదరిక నిర్మూలనే అని చెప్పారు ముఖ్యమంత్రి జగన్. గత ప్రభుత్వమంతా గాల్లో నడిస్తే.. తన నడక మాత్రం నేలపైనే అని చెప్పారు. తన యుద్ధం పెత్తందార్లుతోనే అని స్పష్టం చేశారు. ఇదే తన ఎకనామిక్స్‌.. ఇదే తన పాలిటిక్స్‌ అంటూ ప్రసంగించారు ముఖ్యమంత్రి జగన్. తన ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే అని అన్నారు. ఇదే నాన్నను(వైఎస్ రాజశేఖర్ రెడ్డి) చూసి నేర్చుకున్నా హిస్టరీ అని... ఇవన్నీ కలిపితేనే మీ జగన్‌ అంటూ కామెంట్స్ చేశారు.

అభివృద్ధిలో దేశానికే ఏపీ రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు సీఎం జగన్. రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలు అందించామని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చామన్న ఆయన... ఇప్పటికే దిశ పోలీస్‌ స్టేషనలు ప్రతిచోట కనిపిస్తున్నాయని అన్నారు. 11.28 శాతం ఆర్థిక వృద్ధి రేటు ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. ఆర్థిక నిపుణులే అధ్యయనం చేసేలా ఆర్థిక వృద్ధి రేటు ఉందని... రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచామని చెప్పుకొచ్చారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం అండగా ఉందన్న ముఖ్యమంత్రి... వైసీపీ ప్రభుత్వం వచ్చాక మరో 1.50 లక్షల ఎంఎస్‌ఎంఈలు వచ్చాయని చెప్పుకొచ్చారు. వైద్యరంగంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చామని... గ్రామ స్థాయిలో 10,500 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు.

విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నామన్నారు సీఎం జగన్. లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతోందని చెప్పారు. డీటీబీ ద్వారా లబ్ధిదారులకు రూ. 1,97,473 కోట్లు అందించామని... గడప గడపకు వెళ్లి మేము చేసిన మంచిని చెబుతున్నామని అన్నారు. రాష్ట్రంలో జిల్లాల పెంపుతో సేవలు మరింత చేరువయ్యామని... సచివాలయాల్లో దాదాపు 600 సేవలు అందుతున్నట్లు ప్రకటించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో 98.5 శాతం హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు.

సంబంధిత కథనం