CM Jagan Review: సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం జగన్ ఆదేశాలు-cm ys jagan mohan reddy review on housing department at his camp office in tadepalli ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Review: సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం జగన్ ఆదేశాలు

HT Telugu Desk HT Telugu
May 18, 2023 05:03 PM IST

CM Jagan Latest News: గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సమాచారం సేకరించిన ముఖ్యమంత్రి... అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

సీఎం జగన్
సీఎం జగన్

CM Jagan On Housing Department:గృహనిర్మాణశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గడచిన 45 రోజుల్లో హౌసింగ్‌ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇల్లు పూర్తి చేయగా... రూఫ్‌ లెవల్‌.. ఆపైన నిర్మాణంలో ఉన్నవి 5.01లక్షల ఇళ్లు అని చెప్పారు. త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు... బేస్‌మెంట్‌ లెవల్‌ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షలుపైగా ఉన్నట్లు తెలిపారు. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.

సీఎం ఆదేశాలమేరకు జగనన్నకు చెబుదాం స్పెషల్‌ ఆఫీసర్లు కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఇళ్ల నిర్మాణంలో వాడే మెటీరియల్‌ నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ 11.03 లక్షలమందికి రూ. 35 వేల చొప్పున రుణాలు అందాయని... రూ. 3886.76 కోట్లమేర పావలా వడ్డీకే రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

పంపిణీకి ఏర్పాట్లు చేయండి - సీఎం జగన్

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.... సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్లనిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.... వేగంగా నిర్మాణ పనులును ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్నారు. ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. పేదలకు ఎంతత్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయని పేర్కొన్నారు. ఇందుకు అధికారులు స్పందిస్తూ... సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు చేసినట్లు వివరించారు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఏ ఎండీ ఇంతియాజ్, ఏపి టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ లక్ష్మీషా, మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు

Whats_app_banner