CM YS Jagan Met CJI DY Chandrachud: ఏపీ పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గురువారం విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్... సీజేఐతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్‌కుచేరుకున్న సీజేఐకి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు.,రేపు జ్యూడీషియల్ అకాడమీ ప్రారంభంమంగళగిరికి సమీపంలోని కాజా వద్ద రూపుదిద్దుకొన్న ఆంధ్రప్రదేశ్ జ్యూడీషియల్ అకాడమీని శుక్రవారం సీజేఐ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలుకానుంది. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకొని అక్కడి హెచ్‌హెచ్ డైక్‌మెన్ ఆడిటోరియంలో ఉదయం 9.25 గంటల నుంచి జరిగే ఏపీ హైకోర్టు డిజిటైజేషన్, న్యూట్రల్ సైటేషన్, ఈ-సర్టిఫైడ్ కాపీ అప్లికేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీజేఐ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో పాటు హైకోర్టు జడ్జీలు హాజరవుతారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో కాజాలో ఏపీ జ్యూడీషియల్ అకాడమి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద పటిష్టమైన బందోబస్తును జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది.,,ఏపీలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ మంగళవారం రాష్ట్రానికి చేరుకొన్న సంగతి తెలిసిందే. బుధవారం తిరుమలలో పర్యటించిన ఆయన.. శ్రీవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.